యేసు మన అందరి ప్రభువు
యేసు మన అందరి ప్రభువు
యేసు మన జీవిత వెలుగు
నమ్ము సోదరా! నేడే రక్షణ పొందగ రా!
"యేసయ్యే నిను ప్రేమిస్తున్నాడు
కన్నీళ్ళే నాట్యముగా చేస్తాడు
మనకోసం ఒక కానుక అయ్యాడు
పరలోకం స్వాస్థముగా ఇస్తాడు"
1. ఇరుకైన మార్గమే నువు వదిలివేసావు
మరి ఎంచుకున్నావు విశాల మార్గము
కరుణలేని ఈ లోకం -నిను అన్ని వైపుల ముంచును
తెలిసి తెలిసి పాపములో - పడవద్దు అన్ని వ్యర్ధం
2. ఘనమైన దేవుని బలమైన చేతిలో
విలువైన పాత్రగా నేనుంటాను
కోటి కిరణాల కాంతి - నా యేసు ప్రభువునే చూడ
నా జీవితాన్ని కదిలించే - ఆ కరుణమూర్తి త్యాగం
No comments:
Post a Comment
Suggest your Song in the Comment.