Halaman

Pages - Menu

Pages

Friday, February 28, 2025

YESAYYA NA GHANADHAIVAM SONG LYRICS ll THANDRI SANNIDHI MINISTRIES || Latest Christian Songs 2025


యేసయ్య నా ఘన దైవమా
నా అభిషేక తైలమా
ఆనంద సంగీతమా
నీకే నా స్త్రోత్రము స్తోత్ర సింహాసనం


1. నా ప్రార్ధలను ఆలించు వాడవు
ప్రార్ధనలన్నియు నెరవేర్చువాడవు
మాట తప్పని దేవుడా
మదిలో వ్యధను తొలగించిన
నీకే నా స్త్రోత్రము స్తోత్ర సింహాసనం


2. నా గాయములను మాంపు వాడవు
నూతన బలమును దయచేయువాడవు
మనసును గెలిచిన మగదధీరుడవు
మనవులన్నీ మన్నించిన
నీకే నా స్త్రోత్రము స్తోత్ర సింహాసనం

3. నా శత్రువులను ఎదిరించినవాడవు
ముందు నిలిచిన నజరే్యుడవు
ప్రేమను పంచిన త్యాగ ఘనుడవు
హృదయమందు నివసించిన
నీకే నా స్త్రోత్రము స్తోత్ర సింహాసనం

Oohakandani prema Song Lyrics || Hosanna Ministries 2025 New Album Song-7 || Pas.JOHN WESLEY Anna|| Gudarala Panduga Songs

ఊహకందని ప్రేమ


ఊహకందని ప్రేమలోన భావమే నీవు..
హృదయమందు పరవసించుగానమే నీవు..

మనసు నిండిన రమ్యమైన గమ్యమే నీవు..
మరపురాని కలల సౌధం గురుతులేనీవు..
ఎడబాయలేనన్నానిజ స్నేహమేనీవు..
నీ ప్రేమ కౌగిలిలో ఆనందమే నీవు..

"ఊహకందని ప్రేమ" 1. తల్లడి తల్లే తల్లి కన్నా మించిప్రేమించి
తనువు తీరే వరకు నన్ను విడువలేనంది.."2"
అదియే..ఆ ఆ ఆ నే గాయపరచిన

వేళలో కన్నీరు కార్చిన ప్రేమగా
నులివెచ్చనైన ఒడికి చేర్చిఆదరించిన ప్రేమయే

నీ గుండెలో నను చేర్చిన నీ అమరమైన ప్రేమయే.."2"

"ఊహకందని ప్రేమ"


2. నింగి నేలను కలిపిన బలమైన వారధిగా
నేల కొరిగిన జీవితాన్ని లేవనెత్తెనుగా.."2"
అదియే..ఆ ఆ ఆ తన మహిమ విడిచిన

త్యాగము ఈ భువికి వచ్చిన భాగ్యము
నను దాటిపోక వెదకిన నీ మధురమైన ప్రేమయే
నీ సర్వమిచ్చిన దాతవు నను హత్తుకున్న స్వామివి.."2"

"ఊహకందని ప్రేమ"


3. దేహమందు గాయమైతే కుదుట పడును కదా
గుండె గాయము గుర్తుపట్టిన నరుడు లేడుకదా.. "2"
నీవే నీవే యేసయ్య నా అంతరంగము

తరచి చూసిన గాఢమైన ప్రేమవు..
ననుభుజముపైన మోసినఅలసిపోని ప్రేమవు
నీవు లేనిదే నా బ్రతుకులో విలువంటూ లేనే లేదయ్యా "2"

"ఊహకందని ప్రేమ"

Saturday, February 22, 2025

DATIPOBOKAYA SONG LYRICSll YESE GHANADHAIVAM ll THANDRI SANNIDHI MINISTRIES || Latest Christian Telugu Songs 2025

దాటిపోబోకయ్య యేసయ్యా


దాటిపోబోకయ్య దాటిపోబోకయ్య
దాటిపోబోకయ్య దాటిపోబోకయ్య
యేసయ్యా నా దేవా యేసయ్యా నా ప్రభువా
దాటిపోబోకయ్య దాటిపోబోకయ్య


1. నా వేదనకు మితి లేదు నా శోకానికి తుది లేదు
నీవు గాక జీవితాన ఆశయే లేదు
నీవు గాక జీవితాన ఆశయే లేదు
నాకోసం నువు వస్తావని నా ఆర్త ధ్వని వింటావని
ఎదురు చూస్తున్నాను నిదుర కాస్తున్నాను
దాటిపోబోకయ్య దాటిపోబోకయ్య



2. అవమానాల నా బ్రతుకే ఆవేదనలే నిను వెతికే
నీవు గాక దిక్కు లేక దీనమైపోయే
నీవు గాక దిక్కు లేక దీనమైపోయే

నాకోసం నువు వస్తావని నా ఆర్త ధ్వని వింటావని
ఎదురు చూస్తున్నాను నిదుర కాస్తున్నాను
దాటిపోబోకయ్య దాటిపోబోకయ్య
యేసయ్యా నా దేవా యేసయ్యా నా ప్రభువా
దాటిపోబోకయ్య దాటిపోబోకయ్య

Thursday, February 20, 2025

GOPPA KRUPA SONG LYRICS || GERSSON EDINBARO || Latest Telugu Christian Song 2025

గొప్ప కృప


పల్లవి:
గొప్ప కృప.. మంచి కృప..
జారకుండ కాపాడే గొప్ప కృప
అగ్నిలో కాలకుండ కాపాడే కృప
నీటిలో మునగకుండ కాపాడే కృప "2" మీ కృపయే నన్ను నిలబెట్టేనే
మీ కృపయే నన్ను నడిపించేనే"2" హల్లె హల్లె లూయా హల్లె హల్లె లూయా "2"


1.వేడి వేడి అగ్నిలో వేగకుండా కాపాడే
రక్షించు మీ కృపయే...

వెంట్రుకలు కరగకుండా
పొగ కూడా తగలకుండా రక్షించు

మీ కృపయే "2"
"హల్లె హల్లె లూయా"


2.పలు పలు శోధనలో ఇరుకున సమయాల్లో
విడిపించు మీ కృపయే...
క్రుంగియున్న సమయాల్లో నలిగి నే పోకుండ
కాపాడే నే కృపయే"2" "హల్లె హల్లె లూయా"

Monday, February 17, 2025

HRUDAYALANELE RARAJU SONG LYRICS || AKSHAYA PRAVEEN ||Pastor Praveen||Latest Christian Telugu Songs 2025

హృదయాలనేలే రారాజు


హృదయాలనేలే రారాజు యేసువా
అధరాలపై నీ పేరే కదలాడుతుండగా (2)
నీ కొరకే నేను జీవింతును
నా జీవితమంతా అర్పింతును ||హృదయాల||


1.నా ప్రియులే శతృవులై నీచముగా నిందించి
నన్నెంతో తూలనాడి నా చేయి వీడగా (2)
నా దరికి చేరి నన్ను ప్రేమించినావా
నన్నెంతో ఆదరించి కృప చూపినావా
నా హృదయనాథుడా నా యేసువా
నా ప్రాణప్రియుడా క్రీస్తేసువా ||హృదయాల||

2. నీ హృదయ లోగిలిలోన నను చేర్చు నా ప్రియుడా
నీ ప్రేమ కౌగిలిలోన నను దాచు నా విభుడా (2)
పరలోక మార్గాన నడిపించు నా ప్రభు
అరణ్య యాత్రలోన నిన్నానుకొందును
అతిలోక సుందరుడా శ్రీ యేసువా
రాజాధిరాజా ఘన యేసువా ||హృదయాల||

Friday, February 14, 2025

Agadha Jala Pravahame Song Lyrics|| Nenunna Deva Song Lyrics||Latest Christian Telugu Songs 2025|| Kanthi kala

నేనున్నా దేవా


అగాధ జల ప్రవాహమే ఆర్పలేనిది
అనంత మానవాళికే ఆనవాలివి
తరాలలో యుగాలలో కానరానిది
రెండక్షరాల మాటలో

ఎంత వింతగా ఇమిడింది (2)
దేవా అది నీ ప్రేమే నాకంటే నన్నే ప్రేమించే
నీవంటి వారు లేరయ్యా
నీ కంటి పాపగా కాచే
ఆ ప్రేమ సాటి లేదయ్యా
నీకై నేనున్నానంటూ నిలిచావయ్యా

నీ వెలుగు పంచాలంటూ పిలిచావయ్యా (2)
నీ సాక్షి నేనంటూ నీ రాయబారినంటూ
ఈ జన్మకిది చాలంటూ నేనున్నా నేనున్నా దేవా
నా శ్వాస నన్నొదిలి పోయేదాకా
నేనున్నా నేనున్నా దేవా
నీ చిత్తం నాలో నెరవేరేదాకా


1)బ్రతుకు పోరులో బలము చాలక
భ్రమలు ఆవరించిన వేళలో / వేళా
నా నీతి నా జ్ఞానం ఆధారం కాగా
అలసిపోయి నిలిచితి దేవా (2) తప్పిపోయిన బిడ్డనుగా వున్నాననుచూ
తప్పే దిద్ది సరిచేయుము దేవా అనుచూ
వెన్ను చూపని బతుకిమ్మనుచూ

||నేనున్నా నేనున్నా||


2)ఎవని పంపెదన్ ఎవడు పోవునంటూ
పిలచిన ఆ పిలుపుకే బదులుగా
సిద్ధపడిన సైన్యమై సిగ్గుపడని సాక్షిగా
శుద్ధిచేసి నిలుపుము దేవా (2) ఏ స్థితికైనా నువు నాకు చాలును అనుచూ
ఎందాకైనా నీతోనే సాగెదననుచూ
ఎన్నటికీ నే నీదానిని అనుచూ ||నేనున్నా నేనున్నా||


3)వ్యాధి బాధలో శోధనంచులో
నలిగి కరిగే దీన జీవితాలకై
నాథుడైన నీ ప్రేమను మాటలకే కాక
చేతలలో నింపుము దేవా (2) నీకిష్టముగా నను చెక్కుము దేవా అనుచూ
నీ సన్నిధిలో నిరతం తల దించాననుచూ
నిన్ను చూసే కనులిమ్మనుచూ ||నేనున్నా నేనున్నా||

ENTHO ADBHUTHAMAINA NEE PREMA SONG LYRCS | Sharon Sisters | JK Christopher | Melody | Candy | Jane |Latest Christian Songs 2025

ఎంతో అద్భుతమైన ప్రేమ


ఎంతో అద్భుతమైన నీ ప్రేమ
నను ఎన్నడు విడువని కరుణ
నాపై ఇల చూపించావు
నీ సాక్షిగా నను నిలిపావు అన్ని వేళలా స్తోత్రగీతము నీకై నే పాడెదా
నాకు జీవము నా సహాయము నీవే నా యేసయ్యా
జయం జయం రారాజుకే
స్తుతి ధ్వజం యేసు నీకే


1. ఆశ ఉందయా నాలో - నీ సేవ చేయాలనిలలో
నీవే చాలును నిత్యం నను నడిపించుము
విజయమే నాకు విజయమే
అది నీతో ఉంటె సాధ్యమే "అన్ని వేళలా"


2. నా ప్రతీ అడుగులో నీవే - నా వెన్నంటే ఉన్నావే
నీవే నా ధైర్యము నిరతం నను కాపాడుము

అభయమే నాకు అభయమే
యేసయ్యా నీవే సత్యమే "అన్ని వేళలా"

Parishuddhathmuda Song Lyrics | Powerful TeluguChristian WorshipSong | HolySpirit Song | Bro Aronkumar Nakrekant| Latest

పరిశుద్దాత్ముడా


పల్లవి:-
పరిశుద్దాత్ముడా ప్రియ

సహాయక నన్ను బలపరచగా
నాకై వరమైతివా (2) నీకోసమై నేను వేచి ఉన్న
నీ శక్తితో అయ్యా నన్ను నింపుమా(2) ఆరాధనారాధన ఆరాధనే
ఆరాధనారాధన ఆరాధానే(2)


1:- మేడ గదిలోని అద్భుతము
నేడు మా నడుమ జరిగించుము
అగ్ని నాలుకలై దిగిరాగా
ఆత్మవశులమై ప్రవచింతుము.(2) [నీకోసమై]


2:- మండుచున్న పొదవలెను
నీకై నేను మండాలి
అంధకార జగమంతా
నిన్ను నేను చాటాలి..(2)
[నీకోసమై]

Thursday, February 13, 2025

Amaranadhuda Song Lyrics| Pastor. JOHNBABU Garu | Sis. Keerthana - Sankeerthana| Latest telugu christian Song 2025

అమరనాధుడా



పల్లవి :
అమరనాధుడా,ఆత్మదేవుడా ఆరాధించెదను -
గొప్పదేవుడా ప్రాణనథుడా ఆనంధించెదను.


అనుపల్లవి :
అనుదినం , అనుక్షణం బ్రతుకుట నీ బలం-
ఆయుష్కాలం తండ్రి దేవ నీ వరం -2

|| అమరనాధుడా||


1)నా జీవం నీ కృపలో దాచిన దేవుడవు -
గత కాలం క్షేమంగా కాచిన రాజువు -2 క్షణమైనా నిను వీడి నేనుండలేను స్వామి -

చావైనా బ్రతుకైనా నీ సేవలోనే స్వామి -2
||అనుపల్లవి ||


(2) నా భారం భుజములపై మోసిన తండ్రివి -
నా హృదయ బాధను ఎరిగిన రాజువు -2 మధురమైన నీ ప్రేమే నా ప్రాకారం ఓ దేవ -
నా చెలిమి నా కలిమి నీవేగా ఓ దేవ
||అనుపల్లవి ||


(3)నా మంచి కాపరివై ఓదార్చిన నా ప్రభువా -
నీ దివ్య సన్నిధిలో నను నిలిపిన రాజువు-2 నీ చూపే నా బాటై గురి కలిగించే
యేసయ్య -
నీ మాటే నా శ్వాసై ఇల నడిపించే యేసయ్య -2

||అనుపల్లవి ||

Wednesday, February 12, 2025

Cheyi Pattuko Na Cheyi Pattuko Song Lyrics| Telugu Christian Song | Jessy Paul


చేయి పట్టుకో


చేయి పట్టుకో నా చేయి పట్టుకో
జారిపోకుండా నే పడిపోకుండా
యేసు నా చేయి పట్టుకో (2) ||చేయి||



1. కృంగిన వేళ ఓదార్పు నీవేగా
నను ధైర్యపరచు నా తోడు నీవేగా (2)
మరువగలనా నీ మధుర ప్రేమను (4)
యేసు నా జీవితాంతము
యేసు నా జీవితాంతము ||చేయి||


2. శోధన బాధలు ఎన్నెన్నో కలిగినా
విశ్వాస నావలో కలకలమే రేగిననూ (2)
విడువగలనా ఒక నిమిషమైననూ (4)
యేసు నా జీవితాంతము
యేసు నా జీవితాంతము ||చేయి||

Aradhishunnanu yesayya Song Lyrics || Latest Christian Gospel songs || aradhana songs || Latest Christian Telugu Songs 2025

ఆరాధిస్తున్నాను యేసయ్యా


పల్లవి :
ఆరాధిస్తున్నాను యేసయ్యా "4"

నీ వంటి గొప్ప దేవుడు ఎవరున్నారని

నిను పోలిన పరిశుద్ధుడు ఎవ్వరు లేరని (లేనే లేరని)"2"



1. దూత గణంబుములు ఆరాధనే చేయగా

అల్పుడనైన నా బ్రతుకంతా స్తుతి కోరుకున్నవే "2"

స్తుతియాగం నీకే అర్పిస్తాను యేసయ్య

నా బ్రతుకంతా కీర్తిస్తాను యేసయ్య "2"

స్తుతి ఘనత మహిమ ప్రభావం నీకే యేసయ్య "4"



2. పౌలు సీలలు ఆరాధన చేయగా

స్తుతుల యెదుట సంకెళ్లు విడిపోయేనే "2"

బలహీనతలో బలపరిచే యేసయ్య

నా బ్రతుకంతా నీ కృపయే చాలయ "2"

స్తుతి ఘనత మహిమ ప్రభావం నీకే యేసయ్య "4"



3. దావీదు వలేనేఆరాధనే చేయుచూ

నాట్యమడుచు ఆత్మలో పరవశించిన "2"

నా హృదయంలో ఆశ ఒక్కటే యేసయ్యా

మండుచున్న పొదవలె నేనుండాలని "2"

స్తుతి ఘనత మహిమ ప్రభావం నీకే యేసయ్య "4"

Vevela Doothalu Song Lyrics | Telugu Christian Song 2025 | Surya Prakash Injarapu | Pastor Ashok Reddy |Anand Gurrana

వేవేల దూతలు


ప . వేవేల దూతలు కోటాను కోట్ల పరిశుద్ధులు

పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని కొనియాడుచుండగా

ఆరాధన.. ఆరాధన.. ఆరాధన .. స్తుతి ఆరాధన



1. కెరూబులు సేరాపులు

గాన ప్రతి గానములు చేయగా

ఆ మందిరం నీ మహిమతో

నిండియుండగా

అర్పించుకుందును నేను సజీవయాగముగా

|ఆరాధన|



2. నీ పిలుపుకు నే లోబడి

కొనసాగుచుండగా

నా విశ్వాసము శ్రమ కొలిమిలో

పరిక్షింపబడియుండగా

అర్పించుకుందును నేను నా సాక్ష్య జీవితము

|ఆరాధన |

Neevu Nakundaga Deva Song Lyrics | Raja Mandru | Telugu Christian Songs 2025 | Bro. Bharat Mandru

నీవు నా కుండగా దేవా


నీవు నా కుండగా దేవా జయము నాకేనయ్యా
నీ కృప నాకుండగా దేవా వెనుక నే చూడను
నీ కృప నాకు చాలును దేవా
బలహినతలో జయము పొందేద. ''2''
కృప... కృప... కృప... కృప.. యేసు నీ కృప


1. అందరు నన్ను నిందించినను
నను నమ్మి నాతో నడిచితివయ్యా

నీ కృప నాకు చాలనిపలికి
అభిషేకించి నడిపించుచున్నారు
కృప.. కృప.. కృప.. కృప..యేసు నీకృప


2. బలహినుడను ఎన్నికలేనివాడను
పాపంలో పడి నశించిపోగా
నన్ను బలపరచి యెగ్యునిగా ఎంచి
నీదు సేవలో నిలిపితివయ్యా
కృప.. కృప.. కృప.. కృప యేసు నీ కృప


3. నా అతిశయము నీవేనయ్యా
జీవితాంతము నీకై పాడేదా
ఎన్నడు పాడనీ ఈ కంఠాన్ని
నీదు మహిమతో నింపితిరయ్యా
కృప.. కృప.. కృప.. కృప యేసు నీ కృప

Tuesday, February 11, 2025

KOTI AASALATHO SONG LYRICS I Latest Christian Marriage Song I AR Stevenson | Latest Christian Telugu Songs 2025



కోటి ఆశలతో కొత్త కొత్త ఊహలతో


కోటి ఆశలతో కొత్త కొత్త ఊహలతో
ప్రారంభమైన ప్రయాణం
కావాలి నిత్యం సుఖమయం
ప్రియమైన నవజంటా
అ.ప. సంతోష శుభాకాంక్షలు

నిండైన దైవాశీస్సులు


1. ఇరువురి మధ్యలో విరిసిన ప్రేమలో
స్వచ్ఛత ప్రస్ఫుటించగా
ఏ శోధనకు అవకాశమివ్వక
ఏక మనసుతో విజయాలు పొందగా


2. ఒకరితో మరొకరు పలికిన మాటలో
ఆర్ద్రత పల్లవించగా
ఏ అక్కరకు కలవరము చెందక
వాక్య వెలుగులో ఆదరణ పొందగా


3. నడిచెడు త్రోవలో ఎదురగు బాధలో
సణగక ప్రస్తుతించగా
ఏ ఓటమిలో తలక్రిందులవ్వక
ఆత్మబలముతో ఫలితాలు పొందగా