ఎంతో అద్భుతమైన ప్రేమ
ఎంతో అద్భుతమైన నీ ప్రేమ
నను ఎన్నడు విడువని కరుణ
నాపై ఇల చూపించావు
నీ సాక్షిగా నను నిలిపావు
అన్ని వేళలా స్తోత్రగీతము నీకై నే పాడెదా
నాకు జీవము నా సహాయము నీవే నా యేసయ్యా
జయం జయం రారాజుకే
స్తుతి ధ్వజం యేసు నీకే
1. ఆశ ఉందయా నాలో - నీ సేవ చేయాలనిలలో
నీవే చాలును నిత్యం నను నడిపించుము
విజయమే నాకు విజయమే
అది నీతో ఉంటె సాధ్యమే "అన్ని వేళలా"
2. నా ప్రతీ అడుగులో నీవే - నా వెన్నంటే ఉన్నావే
నీవే నా ధైర్యము నిరతం నను కాపాడుము
అభయమే నాకు అభయమే
యేసయ్యా నీవే సత్యమే "అన్ని వేళలా"
No comments:
Post a Comment
Suggest your Song in the Comment.