అక్షయుడా
తదకం తదమ్ తదకం తదక ధిం తదక ధిం తదమ్ అక్షయుడా నా ప్రియ యేసయ్యా
నీకే నా అభివందనం
అక్షయుడా నా ప్రియ యేసయ్య
నీకే నా అభివందనం
నీవు నాకు కోసమే తిరిగి వస్తావని
నేను నీ సొంతమై కలిసిపోదామని
యుగ యుగములో నన్నేలుతావని
నీకే నా ఘనస్వాగతం
అక్షయుడా నా ప్రియ యేసయ్యా
నీకే నా అభివందనం ||2||
1. నీ బలిపీఠమందు పక్షులకు
వాసమే దొరికెనే
అవి అపురూపమైన నీ దర్శనం
కలిగి జీవించునే
నేనేమందును ఆకాంక్షింతును
నీతో ఉండాలని కలనెరవేరునా
నా ప్రియుడా యేసయ్యా
చిరకాల ఆశలు నెరవేర్చుతావని
మదిలో చిరుకోరిక
తదకం తదమ్ తదకం
తదక ధిం తదక ధిం తదమ్
అక్షయుడా నా ప్రియ యేసయ్యా
నీకే నా అభివందనం
అక్షయుడా నా ప్రియ యేసయ్య
నీకే నా అభివందనం
2. నీ అరచేతిలో నను చెక్కుకొని
మరువలేనంటివే
నీ కనుపాపగా ననుచూచుకొని
కాచుకున్నావులే
నను రక్షించిన ప్రాణమర్పించిన
నను స్నేహించిన నను ముద్రించిన
నా ప్రియుడా యేసయ్యా
పాదార్పణముగా నా జీవితమును
అర్పించుకున్నానయ్యా
తదకం తదమ్ తదకం
తదక ధిం తదక ధిం తదమ్
అక్షయుడా నా ప్రియ యేసయ్యా
నీకే నా అభివందనం
అక్షయుడా నా ప్రియ యేసయ్య
నీకే నా అభివందనం
3. నీవు స్థాపించిన ఏ రాజ్యమైన
కోడువ లేకుండనే
బహు విస్తారమైన
నీ కృపయే
మేలుతో నింపునే
మేలుతో
నింపునే
అది స్థిరమైన
క్షేమమునందునే
నీ
మహిమాత్మతో నెమ్మది
పొందునే
నా ప్రియుడా యేసయ్య
రాజ్యాలేనేలే సాఖాపురుషుడా
నీకు సాటెవ్వరు
తదకం తదమ్ తదకం
తదక ధిం తదక ధిం తదమ్
అక్షయుడా నా ప్రియ యేసయ్యా
నీకే నా అభివందనం
అక్షయుడా నా ప్రియ యేసయ్య
నీకే నా అభివందనం
నీవు నాకు కోసమే తిరిగి వస్తావని
నేను నీ సొంతమై కలిసిపోదామని
యుగ యుగములో నన్నేలుతావని
నీకే నా ఘనస్వాగతం
No comments:
Post a Comment
Suggest your Song in the Comment.