నీ సన్నిధి
ఆనందము ఆద్యంతము
నీతో నామది సంబంధము
ఆశ్చర్యము అసమానము
ఈ దీనునికై నీవిచ్చిన స్థానము
నా తోడుగా యేసు నీవుండగా
నా హృదయమునకు భద్రత నిండుగా
నీ సన్నిధి నా ముందుండగా
అతిశయించి నే పరవశము పొందగా
1. ఈ లోకము నా దేహము
నన్నెంతగానో నిష్ఫలుని చేసెను
మతిమాలిన క్రియలన్నియూ
మృతమైన స్థితికి నను మార్చెను
నా యేసు నాధా నీ స్నేహము
తొలగించె నా శాపకర మార్గము
జవ జీవమంతా జత చేయుచూ
జయ కేతనముగా నను మార్చెను
2. వెలిగింపు లేక జ్ఞానిని కాగలనా
వివరంబు లేక గ్రహియింప తరమా
తరుణంబు లేక వరమొందగలనా
నడిపింపు లేక గురి చేరగలనా
నీ సన్నిధి నను నిల్పుచూ
ఈవులన్నియూ దానమీయుచూ
నెమ్మదంతయూ మనసున నిండ
మరువనుగా అందిన సాయము నీవలన
No comments:
Post a Comment
Suggest your Song in the Comment.