Halaman

Pages - Menu

Pages

Monday, May 18, 2026

Margamu Nene Annadu Yesu Song Lyrics || Telugu Christian Song || Rev. Dr. PHILIP P JACOB || #viral #song

మార్గం నేనే అన్నాడు యేసు



మార్గం నేనే అన్నాడు యేసు
సత్యం నేనే అన్నాడు యేసు
జీవం నేనే అన్నాడు యేసు
నాకై మరణించి లేచాడే నాలో పాపాన్ని తొలగించి శాపాన్ని

విడిపించి జీవం ఇచ్చాడే
నాలో పరిశుద్ధాత్మ నింపి శక్తితో నను నడిపి
గమ్యం చేరుస్తాడే
రానున్న రారాజు నా యేసు మహా రాజు


1. స్వస్థపరచే నా మంచి యేసు
స్వేచ్ఛనిచ్చే నా మంచి యేసు
శ్వాస నింపే నా మంచి యేసు
హృదిలో చోటిస్తే నివసిస్తాడే
||నాలో||


2. విడుదల నిచ్చే నా మంచి యేసు
విజయం ఇచ్చే నా మంచియేసు
విరోధిని జయించే నా మంచి యేసు
విశ్వాస వీరునిగా మలిచాడే
||నాలో||


3.రక్తము కార్చిన నా మంచి యేసు
రక్షణ ఇచ్చిన నా మంచి యేసు
రమ్మని పిలచిన నా మంచి యేసు
చిరకాలం ఆయనతో ఉండాలని

||నాలో||

Na Yesu Manchivadu Song Lyrics| Raj Prakash Paul Songs | Worship Conference Songs #worshipconference2025

నా యేసు మంచివాడు


నా యేసు మంచివాడు.... (4) తేజోమయుడు మృత్యుంజయుడు చల్లని దేవుడు
జ్యోతిర్మయిడు జీవనదాత చక్కని దేవుడు..... (2)


1. మహాశ్చర్య కార్యములెన్నో _

చేయువాడు ఆయన మాత్రమే (2)
ఆయన బహుబలముతో_ మనకు

విడుదల_ జయము అందించెను (2)


2. పరక్రమ కార్యములు ఎన్నో _

చేయువాడు ఆయన మాత్రమే (2)
ఆయన శుద్ధుడు_ఘనుడు_

విజయవంతుడు_ ఆశ్చర్యకరుడు (2)


3. పాపాన్ని గెలిచిన_ మరణము

జయించిన_ శక్తివంతుడు
నీకై నాకై ప్రాణం పెట్టిన ప్రేమామయుడు....(2)

Na Prananiki Pranam Songs Lyrics | Telugu Worship Song 2025 | Re-Imagined Cover – WTP Worship | ✝️ Jesus Song

నా ప్రాణానికి ప్రాణం


నా ప్రాణానికి ప్రాణం - నా జీవానికి జీవం
నా హృదయానికి హృదయం నీవే నీవే
నా పాదాలకు దీపం నా నావకు తీరం
నా పయనానికి గమ్యం నీవే నీవే
నా కొండ నీవే నా కోట నీవే
నాకన్నీ నీవేలే యేసయ్యా

1. ఒంటరి బ్రతుకున జంటగ నిలిచే తోడు నీవే
చీకటి బ్రతుకున వెలుగును నింపే జ్యోతివి నీవే
ఇమ్మానుయేలు నీవే - మహిమాన్వితుడవు నీవే ||2||
నా కన్నీ నీవేలే యేసయ్యా


2. కృంగిన వేళలో ఆదరణిచ్చే స్వస్థతా నీవే
వేదన రోదన శోధనలోన బలము నీవే
యెహోవా రాఫా యెహోవా యీరే ||2||
నా కన్నీ నీవేలే యేసయ్యా


3. కరుణతో కలుషము మాపే కర్తవు నీవే
పాప క్షమాపణ శాప విమోచన ముక్తివి నీవే
నా రక్షణ నీవెలే నిరీక్షణ నీవెలే ||2||
నా కన్నీ నీవేలే యేసయ్యా

Tharinchiponi Song Lyrics | God's Love | A Pranam Kamlakhar Musical | Latest Christian Telugu Songs

తరించిపోనీ


తరించిపోనీ నీ ప్రేమలోనే
ఓ యేసుదేవా నీ దాసినై
నీ సేవలోనే నేనుండిపోనీ
నీ ప్రేమగీతం నే పాడుకోనీ
నీ కంటిపాపై నిలువగలేనా
ఈ జీవితం నీదనీ ఏలుకోలేవా


1. ఉదయం రవికిరణం వరమై తాకనీ
మనసే మైమరచి నిను సేవించనీ
వెన్నెలే సాక్షిగా స్తుతులనే పాడనీ
కన్నులా రూపమే దీపమై వెలగనీ
చక్కనీ చెలిమిని ప్రేమతో కోరెదా


2. వదనం నవకమలం నీతో సాగనీ
మధురం నీ చరితం నేనే పాడనీ
మోక్షమే జీవమై హాయిగా తాకనీ
యేసుతో ప్రాణమై సాగనీ పయనమే
కమ్మనీ గానమై దైవమా చేరెదా

VAAKYAME SAREERA DHAARIYAI SONG LYRICS| Akshaya Praveen | Dollie Rose | Pranam Kamlakhar


వాక్యమే శరీరధారియై


వాక్యమే శరీరధారియై ఈ భువికేయెతెంచెను
దేవుడే దివ్య రూపమై పసిబాలునిగా జన్మియించెను
సర్వాధికారి యేసుడే దీనుడిగా దిగివచ్చెను

ఆదియందున్న వాక్యమే వెలుగై ఉదయించెను
నిసస నిసస నిసస నిసస నిరిగరిగరిని
నిరిరి నిరిరి నిరిరి నిరిరి పమపగరినిస ఈ దినం శుభ దినం యేసు రాజు పుట్టే మరియకు
ప్రతి దినం సునాదము చేయుదము రారాజుకు

1) దైవ కుమారుడు మనుష్య కుమారునిగా మహిలో నివసించెను
ఆల్ఫా ఒమేగా అయిన దేవుడు ఇమ్మనుయెలుగా ఉధ్బవించెను

ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు
నీలో నివసించుటకు సింహాసనమునే విడిచెను

2) మహిమస్వరూపుడు ఆదిసంభూతునిగా ఇలలో పిలువబడెను
ఆ మహిమను విడిచిన దేవుడు నీకై శిశువుగా మార్చబడెను
నిత్యుడగు తండ్రి సమాధానకర్త అధిపతి అయిన దేవుడు
సర్వసృష్టికర్త మానవరూపిగా జన్మియించెను

Nee Chethi Kaaryamu Song Lyrics| #JoshuaShaik | Pranam Kamlakhar | Akshaya Praveen| Telugu Christian Songs 2026

నీ చేతి కార్యము


నీ చేతి కార్యము - నాలోన జరిగించు
నీ దివ్య చిత్తము - నాలోన నెరవేర్చు (2)
నీ సన్నిధానము - నిత్యము కనపరచు
నీ వాగ్దానము - నాలోన స్థిరపరచు
యేసయ్య యేసయ్య - నా బలం నీవయా
ఏ భయం లేదయా - నీ కృప చాలయా



1. నీ దుడ్డు కర్రయు - నీ దివ్య హస్తము
నన్నాదరించును - నన్ను నడిపించును - (2)
నా మంచి కాపరీ - నీ కరుణ కాంతితో
నా జీవితాంతము - వెలిగించుము యేసయ్య యేసయ్య - నా బలం నీవయా
ఏ భయం లేదయా - నీ కృప చాలయా

2. నా శత్రు సైన్యమే - నను చుట్టుముట్టినా
నీ జాలి హృదయమే - నన్ను విడిపించును
కన్నీటి ప్రార్ధనే - నాకున్న ఆయుధం
నా జయము నీవనీ - స్తుతియింతును యేసయ్య యేసయ్య - నా బలం నీవయా
ఏ భయం లేదయా - నీ కృప చాలయా


3. ఉన్నత శిఖరముకు - నన్ను నడిపించును
ఎత్తైన స్థలములపై - నన్ను నిలబెట్టును
నా తోడు నీడగా - నీ వాక్య ధ్యానమే
నా బ్రతుకు బాటను - సరిచేయును యేసయ్య యేసయ్య - నా బలం నీవయా
ఏ భయం లేదయా - నీ కృప చాలయా

Yedaina Aadhaaram Neevega Song Lyrics | 2026 New Telugu Christian Worship Song | Ps. Johnson Clinton | UCH

ఏదైనా ఆధారం నీవేగా



ఏదైనా ఏమైనా ఆధారం నీవేగా
ఏ స్థలమో ఏ క్షణమో ఆధారం నీవేగా (2)
(Chorus)
ఆల్ఫాయు నీవే స్తోత్రములు
ఓమెగాయు నీవే స్తోత్రములు

ఆదియు నీవే స్తోత్రములు
అంతము నీవే స్తోత్రములు….. (2)



Verse 1
పౌలు సీలలు కృంగిన వేళలో,

ఆధారము నీవైతివిచెరసాలలో

దానియేలు ఉండగా, ఆధారము నీవైతివి (2)
నాకున్న పరిస్థితిలో విడుదలకోసమై,నా ఆధారం నీవేగా (2) (Chorus)


verse 2
సంసోనుకు బలము ఆధారమైయున్నావు

సౌలు విజయముకు ఆధారమైయున్నావు(2)
గర్వము అణిచీ గెలుపునిచ్చావు ,నా దీనస్థితిని వెలిగించుమో ప్రభూ!(2)

Thursday, May 14, 2026

Venuthiruganu Song Lyrics | Ne Vembadinthun Song Lyrics | I have decided to follow Jesus | Nokseng | Latest Christian Telugu Songs 2026


VERSE 1 (Telugu)
నే వెంబడింతున్ నా యేసుని నిత్యం
నే వెంబడింతున్ నా యేసుని నిత్యం
నే వెంబడింతున్ నా యేసుని నిత్యం
వెనుతిరుగను నే నెన్నడు
వెనుతిరుగను నే నెన్నడు


VERSE 2 (Telugu)
నన్నందరు విడచినా నే వెంబడింతున్
నన్నందరు విడచినా నే వెంబడింతున్
నన్నందరు విడచినా నే వెంబడింతున్
వెనుతిరుగను నే నెన్నడు
వెనుతిరుగను నే నెన్నడు


VERSE 3 (Telugu)
నా ముందు సిలువ నా వెనుక లోకం
నా ముందు సిలువ నా వెనుక లోకం
నా ముందు సిలువ నా వెనుక లోకం
వెనుతిరుగను నే నెన్నడు
వెనుతిరుగను నే నెన్నడు


VERSE 4 (English)
I have decided to follow Jesus
I have decided to follow Jesus
I have decided to follow Jesus
No turning back no turning back

No turning back no turning back

Ennatiki Viswasanni Song Lyrics || Viswasam Song Lyrics || Latest Telugu Christian Songs


విశ్వాసం


ఎన్నటికీ విశ్వాసాన్ని వదలివేయవద్దు
మీరు విశ్వసిస్తే అన్నీ సాధ్యమే ఆవగింజంత విశ్వాసం మీకుంటే చాలు
ఆశించే కార్యాలు అన్నీ జరుగును చిరునవ్వులతో వస్తాడు
ఉత్తమమైనది ఇస్తాడు


1. యోబును ఎరిగిన నీవు
పలువిధ శ్రమలకు నడుమ
విసుగక దేవునియందు నిలిచియుంటే యోబుకున్న ఆశీర్వాదం నీకు ఉన్నది
పోయినవి రెండింతలుగా పొందుకొందువు
ఇక సమృద్ధితో ఉందువు


2. సంతానభాగ్యం కోసం
నిరిక్షించు శారాలాగా
రేయింబగలు నీవు ఏడ్చుచుంటివా అబ్రాహాము ఆశీర్వాదం నీకు ఉన్నది
ఎంత కాలమైనా గాని ఫలితమున్నది
నీ విశ్వాసం వమ్మైపోదు

NEELANTI GOPPA PREMA SONG LYRICS || Ps.Jyothi Raju || Telugu Christian Song | Live Worship |

నీలాంటి గొప్ప ప్రేమ


నీలాంటి గొప్ప ప్రేమ - నీలాంటి జాలి మనసు
నేనెన్నడూ చూడలేదు - ఎప్పుడూ చూడలేదు

మాటలు చాలని మధురానుభవము
" నీలాంటి"


1. దావీదు కుమారుడా - కరుణించమనినా "2"
అంధుని ఆక్రందనను ఆలకించినావు
నీకు ఇష్టమైతే శుద్ధిచేయమనినా"2"
కుష్ట రోగి కష్టమంతా తీసివేసినావు "2"


2. యేసు నీ రాజ్యములో - చేర్చుమని వేడినా"2"
ప్రక్కనున్న పాపి ప్రార్ధనాలకించినావు
నేడు నీవు నాతో పరదైసులోన"2"
వుందువని దొంగతో క్షమించి చెప్పినావు"2"

Gowravimpajeyunu Song Lyrics | The Promise 2026 | Telugu Christian Song | Jesus Calls




యేసుని రూపం నీలో తెలియును
క్రీస్తుని జీవం నిన్ను నిలుపును
నా ప్రాణమా నీకు కలతెందుకే
నీ శ్రమను ప్రభు చూచుచుండెనే గొప్ప జనముగా నిను చేయున్
ఘనమగు పేరు నీకిచ్చున్ తగినకాలమున శ్రీఘముగా
ఆయనే ఇది జరిగించున్


1. కొరగని రాయన్న వారి ఎదుటనే
మూలకు తలరాయి గా నిన్ను చేయునే
సకల జాతులు నిన్ను కోరును
యేసుని మహిమతో నిండేదవు ఈ వసత్సరమే యేసు నీలో వెలువగును
"గొప్ప జనముగా"


2. విరిగిన నీ బ్రతుకు బాగుచేయును
ఘనమగు దినములు నియమించును
పడిపోయిన చోటున నీవు తల ఎత్తును
రాజ విందులు లో నీకు స్థానమిచ్చును ఈ వసత్సరమే అధికముగా ఖ్యాతినిచ్చును

"గొప్ప జనముగా"

Nuvvivakuntey Na Yesayya Song Lyrics | Telugu Christian Song | Jessi D | Sudhakar Rella | Female

నువివ్వకుంటే


నువివ్వకుంటే ఏది లేదయ్యా
నీ కృప లెనిదే ఏది రాదయ్యా
నా ప్రాణము నా జీవము నా సర్వము నా సమస్తము
అంతయు నీదే యేసయ్య...

నా యేసయ్య స్తుతి చెల్లించేద నేనయ్య


1. నేను కలిగిన రూపము నేను కలిగిన ఊపిరి
నేను కలిగిన ఈ స్థితి నేను కలిగిన ధన్యత
నా ధనము ఘనము జ్ఞానం బుద్ది నీదే యేసయ్య
స్తుతియు ఘనత మహిమ స్తోత్రం నీకే మెసయ్య


2. నేను పొందిన రక్షణ నేను పొందిన స్వస్థత
నేను పొందిన విడుదల నేను పొందిన విజయము
నా బలము ధ్వజము కొండ కోట నీవే యేసయ్యా
స్తుతీయు మహిమ ఘనత స్తోత్రం నీకే మెసయ్యా

Udayamu Ratriyu Halleluyah Song Lyrics | Hallelujah Telugu Songs Lyrics | JohnJebaraj #johnjebarajnewsong #tamilchristiansongs #jjsongs

హల్లెలుయా


ఉదయము రాత్రియు హల్లెలుయా
నా ప్రతి శ్వాసయు హల్లెలుయా "2" నే సొమ్మసిల్లు వేళ నా బలముగా మారున్
నే సోలిపోవు వేళ నా ఆత్మ పాడు పాట హల్లెలుయా హల్లెలుయా నా ఉన్నతిలో నా తగ్గింపులో నా ఆత్మ పాడు పాట
హల్లెలుయా హల్లెలుయా "2"


1. శిఖరపు అంచులో హల్లెలుయా
అగాధపు లోయలో హల్లెలుయా "2" పైపైకి ఎగిరినపుడు నా విజయగీతమాయే
నే పడిపోయినపుడు ఓదార్పు రాగమాయే హల్లెలుయా హల్లెలుయా "2" నా ఉన్నతిలో నా తగ్గింపులో నా ఆత్మ పాడు పాట హల్లెలుయా హల్లెలుయా "2"

2. శత్రువు నవ్వినా హల్లెలుయా
హేళన చేసిన హల్లెలుయా "2" పగవారు పెరుగుచుండగా నావిందు కూడా పెరుగును
స్తుతియించి పాడినపుడు చెరసాల తెరువబడును హల్లెలుయా హల్లెలుయా "4" నా ఉన్నతిలో నా తగ్గింపులో నా ఆత్మ పాడు పాట హల్లెలుయా హల్లెలుయా "3"

Nee Sannidhi Chalu Song Lyrics|| Telugu Christian Song 2025 || Abhi Joy || Reverence Worship 4K


మేఘస్తంభమైన సన్నిధిని రూపు మార్చగల

సన్నిధిని (x2)
నడిపించే సన్నిధిని నను వీడి పోనివ్వకు (x2) బలహీనుడు బలవంతుడవునే
నీ సన్నిధి వచ్చుటచే
ఏమి లేకపోయినా నిండుగా ఉండెదన్
నీ సన్నిధిలో నేను నీ సన్నిధియే నాకు చాలయా నా హృదివాంఛ

నీవెనయా (x2)

1. మన్నాను పక్షులను నీటిని అందించావు

అన్నియు అధికముగా ఉన్నవి(x2) అన్ని ఉండి నీవు లేకపోతే పయనం ఆగిపోవును (x2)
నీవు రావా నా యొద్దకురా ఈ విశ్వాస యాత్రలో
నువ్వు నడువు నా ముందు నడువు ఈ విశ్వాస యాత్రలో (x2)
నీ సన్నిధియే నాకు చాలయా నా హృదివాంఛ

నీవెనయా (x2)

2. ఈ లోక అధికారం రాజ కిరీటము తలపై మెరుస్తూ ఉంటున్నను (x2) అన్ని ఉండి నీవు లేకపోతే పయనం ఆగిపోవును (x2)
నువ్వు రావా నా యొద్దకురా ఈ విశ్వాస యాత్రలో
నీవు నడువు నా ముందు నడువు ఈ విశ్వాస

యాత్రలో (x2) నీ సన్నిధియే నాకు చాలయా నా హృదివాంఛ

నీవెనయా (x2) అన్ని ఉండి నీవు లేకపోతే పయనం ఆగిపోవును (x2)
నువ్వు రావా నా యొద్దకురా ఈ విశ్వాస యాత్రలో
నువ్వు నడువు నా ముందు నడువు ఈ విశ్వాస యాత్రలో (x2) నీ సన్నిధియే నాకు చాలయా నా హృదివాంఛ నీవెనయా (x2)

NEE CHITHAME SONG LYRICS | LATEST TELUGU CHRISTIAN WORSHIP SONG by Pr. Ravinder Vottepu

నీ చిత్తమే జరగాలి


ప:
నీ చిత్తమే జరగాలి నాలో యేసయ్య
నీ రాజ్యమే రావాలి నాలో మేసయ్య -2 అ:ప: ఆత్మతో నింపుము నీవలే బ్రతికెదా
మార్గము చూపుము నీవలే నడిచెదా -2
||నీ చిత్తమే||



1) నా జీవము నా ప్రాణము
నీలోనే దాచవయ్య
నా స్వాస్థ్యము మహిమైశ్వర్యము
నీలోనే దాచవయ్య నీ శక్తిని పొందుటకు నీ కృపలతో నింపూము
నీ రక్తముతో కడిగి మార్చుము యేసయ్యా -2

||నీ చిత్తమే||

2)నా జీవిత ప్రణాళిక
నీ ప్రేమ సంకల్పమే
నాకోసము సిద్ధపరచిన
నీ కార్యములు చేయుము నా ఇష్టము కాదయ్య నీ చిత్తమే యేసయ్య
నా ఉనికిని నిలుపునది నీవయ్యా యేసయ్య

||నీ చిత్తమే||

Tuesday, May 12, 2026

Aradhana Chethunu Song Lyrics | Latest Telugu Christian Songs 2025 | Latest Christian Worship Song

ఆరాధన చేతును

ఆరాధన చేతును అన్ని వేళలా
ఆత్మతో సత్యముతో ఆరాధింతును (2)
నా ప్రాణ ప్రియుడు యేసయ్యకు
నన్ను కన్న తండ్రి నా యేసుకు (2)
స్తుతి స్తుతి స్తుతి స్తుతి ఆరాధన
హల్లెలూయ హల్లెలూయ ఆరాధన (2)
ఆరాధన ఆరాధన - ఆరాధన ఆరాధన (2)


1. బలవంతుడా జయశీలుడా
మృత్యుంజయుడా నా జీవనదాతా (2)
ఉన్నవాడా అనువాడా నీకే స్తోత్రము
సృష్టికర్త సజీవుడా నీకే స్తోత్రము (2)
స్తుతి చేయుట నాకు ఎంతో శోభస్కరము (2)
స్తుతి స్తుతి స్తుతి స్తుతి ఆరాధన
హల్లెలూయ హల్లెలూయ ఆరాధన (2)
ఆరాధన ఆరాధన - ఆరాధన ఆరాధన (2) || ఆరాధన ||


2. నీతి సూర్యుడా నిజమైన దేవుడా
శక్తి మంతుడా సర్వ శక్తి మంతుడా (2)
నీవు తప్ప ఎవరు నాకు లేనె లేరయ్యా
నిన్ను తప్ప వేరెవరిని పూజింపనయ్యా (2)
నిత్యము నీ నామమునే స్తుతియించెదను (2)
స్తుతి స్తుతి స్తుతి స్తుతి ఆరాధన
హల్లెలూయ హల్లెలూయ ఆరాధన (2)
ఆరాధన ఆరాధన - ఆరాధన ఆరాధన (2) || ఆరాధన ||