Pages - Menu

Pages

Monday, May 18, 2026

Nee Chethi Kaaryamu Song Lyrics| #JoshuaShaik | Pranam Kamlakhar | Akshaya Praveen| Telugu Christian Songs 2026

నీ చేతి కార్యము


నీ చేతి కార్యము - నాలోన జరిగించు
నీ దివ్య చిత్తము - నాలోన నెరవేర్చు (2)
నీ సన్నిధానము - నిత్యము కనపరచు
నీ వాగ్దానము - నాలోన స్థిరపరచు
యేసయ్య యేసయ్య - నా బలం నీవయా
ఏ భయం లేదయా - నీ కృప చాలయా



1. నీ దుడ్డు కర్రయు - నీ దివ్య హస్తము
నన్నాదరించును - నన్ను నడిపించును - (2)
నా మంచి కాపరీ - నీ కరుణ కాంతితో
నా జీవితాంతము - వెలిగించుము యేసయ్య యేసయ్య - నా బలం నీవయా
ఏ భయం లేదయా - నీ కృప చాలయా

2. నా శత్రు సైన్యమే - నను చుట్టుముట్టినా
నీ జాలి హృదయమే - నన్ను విడిపించును
కన్నీటి ప్రార్ధనే - నాకున్న ఆయుధం
నా జయము నీవనీ - స్తుతియింతును యేసయ్య యేసయ్య - నా బలం నీవయా
ఏ భయం లేదయా - నీ కృప చాలయా


3. ఉన్నత శిఖరముకు - నన్ను నడిపించును
ఎత్తైన స్థలములపై - నన్ను నిలబెట్టును
నా తోడు నీడగా - నీ వాక్య ధ్యానమే
నా బ్రతుకు బాటను - సరిచేయును యేసయ్య యేసయ్య - నా బలం నీవయా
ఏ భయం లేదయా - నీ కృప చాలయా

No comments:

Post a Comment

Suggest your Song in the Comment.