Pages - Menu

Pages

Sunday, May 10, 2026

CHERITHI NINNE SONG LYRICS | #JoshuaShaik | Pranam Kamlakhar | Akshaya Praveen | Telugu Christian Songs 2026

చేరితి నిన్నే



చేరితి నిన్నే యేసునాధ - నీవే నా దైవం

కోరితి నిన్నే ఆశతీరా - మనసే నీ సొంతం

ఉన్నతమైన నీ ఘన నామం - జీవము నింపే ఆశాదీపం

నీవే నా గానం - నాలో ఆనందం

నీవే రాగం - నీవే ధ్యానం - నా ప్రాణం నీవేగా



1. ప్రేమకు రూపం - నీ అనురాగం - పాడి కీర్తింతును

జీవితమంతా నీ ఘనకార్యం - నేను వివరింతును

నా తోడుగా నీవుండగా - నీ ప్రేమతో దీవించగా

సాగాలి ఈ స్నేహము - ఇదే నాకు ఆధారము

చూపావు నీ మార్గము - సదా నీవే నా క్షేమము



2. నా శ్రమలోన వేదనలోన - నన్ను చూసావుగా
నీ కృపలోన నా దరి చేరి - నీలో దాచావుగా

నీ ఆత్మతో నింపావుగా - కనుపాపగా కాచావుగా

ఏనాటి అనుబంధమో - ఇదే నాకు సౌభాగ్యము

వేవేల స్తోత్రాలతో - సదా నీకే నా గీతము

No comments:

Post a Comment

Suggest your Song in the Comment.