Pages - Menu

Pages

Thursday, May 28, 2026

NA HRUDHAYALOGILILO SONG LYRICS | A.R. Stevenson | S.P. Balasubrahmanyam | Old Christian Songs


నా హృదయ లోగిలిలో


నా హృదయ లోగిలిలో కొలువైన నా స్వామి
నీ ప్రేమ కౌగిలిలో నను ఒదిగిపోనీ అ.ప. : నీ ఆత్మతో నను నిండనీ - నీ సాక్షిగా ఇలలో నన్నుండనీ


1. నాలోపల సంచరించి - నాతోభుజియించి
జీవపుమార్గము చూపించి - సరిగానడిపించి
నా జీవితం వెలిగించినావా -

నీ రూపమే నాలో ముద్రించినావా


2. బలహీనతలను హరియించి - శక్తితో దీవించి
అజ్ఞానము నిర్మూలించి- సత్యము బోధించి
నా భారమే భరియించినావా -

నీ శాంతినే నాలో స్థాపించినావా


3. అనురాగముతో బంధించి - ఆప్యాయత పంచి
ఆనందము ననుగ్రహించి - ఆత్మీయత పెంచి
నా శోకమే తొలగించినావా -

స్తుతిగానమే నాలో పలికించినావా

No comments:

Post a Comment

Suggest your Song in the Comment.