Pages - Menu

Pages

Tuesday, May 12, 2026

Nakenno Melulu Chesithive Song Lyrics| Telugu Christian Worship Song 2021 | Mrs Blessie Wesly

నాకెన్నో మేలులు చేసితివే


నాకెన్నో మేలులు చేసితివే – నీకేమి చెల్లింతును

– దేవా నీకేమి అర్పింతును
హల్లెలూయా యేసునాథా – కృతజ్ఞతా స్తుతులివే

1. కృప చేత నన్ను రక్షించినావే –

కృప వెంబడి కృపతో – నను బలపరచితివే
నన్నెంతగానో ప్రేమించినావే –

నా పాపమును కడిగి – పరిశద్ధపరచితివే



2. నాకిక ఆశలు లేవనుకొనగా –

నా ఆశ నీవైతివే – ఆశలు తీర్చితివే నలుదిశల నన్ను భయమావరింప –

నా పక్షమందుంటివే – నాకభయమిచ్చితివే


3. నా కాడి మోసి నా తోడు నీవే –

నీ చేతి నీడలో – నను దాచియున్నావే ఏ కీడు నాకు రాకుండ చేసి –

నీ జాడలో నన్ను- నడిపించుచున్నావే



4. నీ రాజ్యమందు నను చేర్చుకొందువు –

రానున్న రారాజువు – నా రాజువు నీవు నీ వధువు సంఘమున నను చేర్చుకొన్నావు-

నను కొన్నవాడవు-నా వరుడవు

No comments:

Post a Comment

Suggest your Song in the Comment.