నీ కృప లేనిదే
నీ కృప లేనిదే నే బ్రతుకలేను
నీ కృప నాకు చాలును యేసయ్యా (2)
నా యేసయ్యా నా స్తుతి గానమా
కృతజ్ఞత స్తుతులు నీకేనయ్య (2)
కృతజ్ఞత స్తుతులు.. నీకేనయ్య…
నీ కృప చాలు దేవా
నీ ప్రేమ చాలు దేవా (2)
1. ఒంటరి పయనంలో నా కన్నీటిలో
అవమానం దరిచేరి కృంగియున్న వేళలో (2)
తోడుగా నిలిచింది నీ కృపా
కన్నీరు తుడిచింది నీ కృపా
మహిమ నిచ్చింది నీ కృపా
మహిమగ మార్చింది నీ కృపా – (2)
నీ కృప చాలు దేవా
నీ ప్రేమ చాలు దేవా (2)
2. వేవేల దూతలతో కొనియాడబడుచున్న
ఇహమందు శుద్దులతో ఆరాధించబడుచున్న (2)
వేల్పులలో నీవంటి వారే లేరు
ఇహమందు నీతోటి సమమే కారు
మహిమకు అర్హుడవు నీవే
మహిమగల మహరాజువు నీవే – (2)
మహిమంతా నీకే దేవా
నా స్తుతులు నీకే దేవా (2) // నీ కృప లేనిదే //
3. నూతన యెరూషలేం నాదు గంమ్యమే అని
సియోను రారాజ నేను నీదు రాజ్యము చేరి (2)
కన్నులారా నిను చూచుచూ
కనకంబుపై నేను విహరించుచు
నీదు నామ మహిమను ఘనపరచుచూ
నీ తోటి ఉండే భాగ్యం దయచేయుమా – (2)
మహిమంతా నీకే దేవా
నా స్తుతులు నీకే దేవా (2) // నీ కృప లేనిదే //
No comments:
Post a Comment
Suggest your Song in the Comment.