భయము లేదు
పల్లవి: నేను నమ్మిన నా దేవుడు సర్వశక్తిమంతుడు
నేను నమ్మిన నా యేసయ్య సర్వశక్తిమంతుడు
భయము లేదు నాకు భయము లేదు
యేసు ఉండగా నాకు భయము లేదు
1.యెరికో కోటైన భయము లేదు
ఎర్ర సంద్రమైన భయము లేదు
సింహాల గుహఐన భయము లేదు
గొల్యాతు అయిన భయము లేదు ||2||
||భయము||
2.ఎబినేజర్ ఉండగా భయము లేదు
ఎల్ రోయి ఉండగా భయము లేదు
ఎల్షడాయ్ ఉండగా భయము లేదు
యేసు ఉండగా భయము లేదు ||2||
||భయము||
3.మరణపు లోయ అయిన భయము లేదు
శోధనలెదురైన భయము లేదు
వ్యాధి బాధలైన భయము లేదు
శత్రువులు ఎదురైన భయము లేదు ||2||
||భయము||
No comments:
Write CommentsSuggest your Song in the Comment.