Telugu Christmas Mashup 4.0
మన యేసు బెత్లెహేములో
చిన్న పశుల పాకలో పుట్టెన్
పాకలో పుట్టెన్ పాకలో పుట్టెన్
జ్ఞానులంతా చుక్క ద్వారా
యేసుని యొద్దకు వచ్చి యుండిరి
వచ్చి యుండిరి కానుక లిచ్చిరి
నరులా రక్షణ కోరి
పరలోకపు మహిమ విడచి
కరుణగల దేవుడిలలో
నరరూపుడైన దినము
ఆనందా శుభదినము
అందరికిదే దినము
బెత్లెహేము నందు కన్య గర్భమందు
పుట్టినాడు నేడు క్రీస్తు యేసు రాజు
దూత ద్వార గొల్లలు తారను జూచి జ్ఞానులు
వచ్చి యేసునారాధించిరి
మనమంత కూడి సంతోషించెదం
గీతములు పాడి సువార్త చాటెదం
ఇది క్రిస్మస్ ఇది క్రిస్మస్
మనం కలిసి పాడుదాం
ఇది క్రిస్మస్ ఇది క్రిస్మస్
భలే సందడి చేసేద్దాం
వార్తో సత్య శుభవార్త
వార్త నాలకించి గొల్ల బోయులార వినరే
పరముకో నరుని రూపమందునా
బీద కన్య గర్భమందు నాదుడుద్భవించెను
గొల్లల్లారా వెళ్లిరండి వేగమే
వెళ్లి లోక రక్షకుని వెదకిరండి అచ్చట
తూర్పు దిక్కు చుక్క బుట్టె
మేరమ్మ ఓ మరియమ్మా
చుక్కాన్ జూచి మేము వచ్చినాము
మ్రొక్కి బోవుటాకు
పశువుల పాకలోని బాలుడమ్మ
పాప రహితుడమ్మా
పాపాంబు బాపను పుట్టెనమ్మ
సత్య వంతుడమ్మా
No comments:
Write CommentsSuggest your Song in the Comment.