
Ni Namamulone Swasthatha Song Lyrics || Latest Christian Songs || Jessy Paul Songs
నీ నామములోనే
మాకు స్వస్థత
నీ నామములోనే మాకు స్వస్థత ఉన్నది
నీ త్యాగములోనే మాకు విడుదల ఉన్నది (2)
నా ప్రాణము నా సర్వము నీవే
నా యేసయ్య యేసయ్యా యేసయ్యా
నా శక్తియు నా ఆశ్రయం నీవే నా యేసయ్యా
యేసయ్యా యేసయ్యా (2)
1. దానియేలు సింహపు బోనులో ప్రార్ధించగా దేవా
సింహపు నోళ్లను మూసివేసినావు (2)
నా కష్టకాలమందు నే ప్రార్ధించగానే
నను విడిపించినా నా యేసయ్యా (2)
॥ నా ప్రాణము ॥
2. అబ్రహాము విశ్వాసంతో వేచియుండగా దేవా
మూయబడిన శారా గర్భమును తెరచితివి (2)
విశ్వాసముతో నే ప్రార్ధించగానే
నా ఆశలన్నీయు తీర్చిన దేవుడవు (2)
॥ నా ప్రాణము ॥