ఆకాశ వాకిళ్ళు తెరచి
పల్లవి : ఆకాశ వాకిళ్ళు తెరచి
ఆశీర్వాదపు జల్లులు కురిసీ
ఆత్మీయ మేలులను చూపి
ఆశ్చర్య కార్యములు చేసీ
అప: ఆశీర్వదించును
యేసయ్యనిన్ను
ఆనందతైలముతో
అభిషేకించున్ (2) ॥ఆకాశ॥
1. అనేక జనముల కంటే
అధికముగా హెచ్చించును
నీచేతి పనులన్నింటినీ
ఫలియింపచేయును (2)
ఆశీర్వదించును యేసయ్య
నిన్ను ఐశ్వర్య ఘనతను
నీకిచ్చును (2) ॥ఆకాశ॥
2. మునుపటి దినముల కంటే
రెండంతలు దీవించును
నీవెళ్ళు స్థలములన్నిటిలో
సమృద్ధిని కలిగించును (2)
ఆశిర్వదించును యేసయ్య
నిన్ను స్వస్థతను నెమ్మదిని
నికిచ్చును (2) ॥ఆకాశ ॥
3. ఆత్మ బలముతో నిండి
అగ్ని వలె మారుదువు
ఆత్మ ఫలములు కలిగి
అభివృద్ధి పొందెదవు (2)
అభిషేకించును యేసయ్య
నిన్ను ఆత్మీయ వరములు
నీకిచ్చును (2). ॥ఆకాశ ॥
No comments:
Write CommentsSuggest your Song in the Comment.