ఊహించలేని
పల్లవి:
ఊహించలేని కార్యములు జరిగించినావు ప్రభువా
వివరించలేని మేలులను చేసినావు యేసయ్యా - 2
నీవే గొప్ప దేవుడవు - నీవే మహారాజువు - 2
సర్వం నీకు సాధ్యము మా దేవా
సర్వాధికారి నీవు మా ప్రభువా - 2
1. పలు శోధన వేదనలో మా పక్షమున ఉండి
పూర్ణరక్షణను మాకు చూపవు - 2
మా అనుదిన భారము భరించినావు
మరణములోనుండి తప్పించినావు - 2
తప్పించినావు || సర్వం||
2. ఎన్నో అపజయములు మమ్ము వెంటాడినా
పూర్ణవిజయము నీలో దొరికెను - 2
మా చీకటి బ్రతుకులను వెలిగించినావు
పాపములోనుండి విడిపించినావు - 2
విడిపించినావు || సర్వం||
No comments:
Write CommentsSuggest your Song in the Comment.