Pages - Menu

Pages

Saturday, November 3, 2018

Priyathama Bandhama | ప్రియతమ బంధమ - నా హృదయపు ఆశ్రయ దుర్గమ | Raj Prakash Paul | Telugu Christian Song

ప్రియతమ బంధమ - నా హృదయపు ఆశ్రయ దుర్గమ 

ప్రియతమ బంధమ - నా హృదయపు ఆశ్రయ దుర్గమ 
అనుదినం అను క్షణం - నీ వడిలో జీవితం ధన్యము 
                               కృతజ్ఞతతో పాడెదను - నిరంతరము స్తుతించెదను                         || 2 ||


1. అంధకారపు సమయములోన - నీతి సూర్యుడై ఉదయించావు 
గమ్యం ఎరుగని పయనములోన - సత్య సంధుడై నడిపించావు 

                             నా నిరీక్షణ ఆధారం నీవు - నమ్మదగిన దేవుడ నీవు                         || 2 ||
                           కరుణ చూపి రక్షించినావు - కరుణ మూర్తి యేసు నాథ                       || 2 ||
వందనం వందనం - దేవా వందనం వందనం
అనుదినం అను క్షణం నీకే - నా వందనం వందనం 
                                కడవరకు కాయుమయ - నీ కృపలో దాయుమయ                        || 2 || 



2. పరమ తండ్రివి నీవేనని - పూర్ణ మనసుతో ప్రణుతించెదను
పరిశుద్ధుడవు నీవేనని - ప్రాణాత్మలతో ప్రణమిల్లేదను 

                              విశ్వసించిన వారందరికీ - నిత్య జీవము నొసగె దేవా                          || 2 || 
                         దీనుడను నీ శరణు వేడితి - ధన్యుడను నీ కృపను పొందితి                     || 2 || 

వందనం వందనం - దేవా వందనం వందనం
అనుదినం అను క్షణం నీకే - నా వందనం వందనం 
                               కడవరకు కాయుమయ - నీ కృపలో దాయుమయ                        || 2 ||

Song: Priyathama Bandhama 
Written, Sung,
 Music: Raj Prakash Paul 
 Album: 
Nithya Nibandhana 


SUBSCRIBE  :
 
             

5 comments:

Suggest your Song in the Comment.