ఎరుగనయ్య నిన్నెప్పుడు
ఎరుగనయ్య నిన్నెప్పుడు || 2 ||
నన్ను వెదకుచుంటివ ఓ ప్రభువ || 2 ||
ఎరుగనయ్య.....
1. నీ ప్రేమ శాశ్వతమేగ || 2 ||
నీ కరుణ సాగరమేగ || 2 ||
నిన్ను కొలువ భాగ్యమేకద || 2 ||
నన్ను పిలువ వచ్చిన ఓ ప్రభువ || 2 ||
ఎరుగనయ్య నిన్నెప్పుడు || 2 ||
నన్ను వెదకుచుంటివి ఓ ప్రభువ || 2 ||
ఎరుగనయ్య.....
2. నీ పలుకే తీర్చు నా ఆకలి || 2 ||
నీ స్మరణము కూర్చు బలిమిని || 2 ||
నీ బ్రతుకే వెలుగు బాట || 2 ||
నన్ను కొలువ వచ్చిన ఓ ప్రభువ || 2 ||
ఎరుగనయ్య.....
3. వలదయ్య లోక భ్రాంతి || 2 ||
కడు భారము ఘోర వ్యాధి || 2 ||
నిన్ను చేరిన నాకు మేలు || 2 ||
నీ రక్షణ చాలు చాలు నా ప్రభువ || 2 ||
ఎరుగనయ్య నిన్నెప్పుడు || 2 ||
నన్ను వెదకుచుంటివ ఓ ప్రభువ || 2 ||
ఎరుగనయ్య.....
SUBSCRIBE :
No comments:
Post a Comment
Suggest your Song in the Comment.