Pages - Menu

Pages

Saturday, August 17, 2019

Kannita Karigina Smrutulu | కన్నీట కరిగిన స్మృతులు || 2019 Song Lyrics

కన్నీట కరిగిన స్మృతులు 

కన్నీట కరిగిన స్మృతులు - గుండెల్లో ఎన్నో వ్యధలు 

విశ్వాసుల జీవితాలు - పలుకుతున్న సాక్ష్యాలు 

రాళ్ళ క్రింద నలిగిన వాళ్ళు - రంపాలకు తెగిపడినోళ్లు 

కత్తుల రక్తాక్షరాలు - క్రీస్తు కొరకు హతసాక్షులు 

పరదేశులు యాత్రికులు 

తండ్రికిష్టులైన  తనయులు - ఎంత యోగ్యులు 

నీతిమంతులు మార్గదర్శులు 

మాదిరి మనకుంచిపోయిన - మార్గదర్శులు 

కన్నీట కరిగిన స్మృతులు - గుండెల్లో ఎన్నో వ్యధలు 

విశ్వాసుల జీవితాలు - పలుకుతున్న సాక్ష్యాలు 

రాళ్ళ క్రింద నలిగిన వాళ్ళు - రంపాలకు తెగిపడినోళ్లు 

కత్తుల రక్తాక్షరాలు - క్రీస్తు కొరకు హతసాక్షులు 

1.   పలుమార్లు ఆకలిదప్పులు - అపరిమితముగా తిన్నదెబ్బలు 

చెరసాలలో పొందిన యాతనలు 

ఆపదలలో అనేక మారులు - ప్రాణాపాయములు నిందలు 

జాగరణములు ఉపవాసములు 

లోకమునకు నచ్చనివారు - తిరస్కారములు పొందారు 

సకల జనులు ద్వేషించినవారు 

కుటుంబములు కోల్పోయారు - దిగంబరులుగా మారారు 

కొండలలో గుహలలో బ్రతికారు 

ప్రణమిచ్చిన క్రీస్తు దాసులు 

తమ సిలువను మోస్తుబ్రతికిన - గొప్ప వీరులు 

ఆజ్ఞ మీరని ఆత్మపూర్ణులు - తమ పరుగును కడముట్టించిన 

మార్గదర్శులు 

కన్నీట కరిగిన స్మృతులు - గుండెల్లో ఎన్నో వ్యధలు 

విశ్వాసుల జీవితాలు - పలుకుతున్న సాక్ష్యాలు 

రాళ్ళ క్రింద నలిగిన వాళ్ళు - రంపాలకు తెగిపడినోళ్లు 

కత్తుల రక్తాక్షరాలు - క్రీస్తు కొరకు హతసాక్షులు 

2.  హృదయమందు భద్రము వాక్యము 

ఉపద్రవములో విస్వాసము - అలుపెరుగని యోధుల ప్రయాణము 

సిలువను గూర్చిన ఉపదేశం - లోకానికి ఎంతో అల్పము 

సిగ్గుపడని పాదము సుందరము 

లోకమునకు వేడుకవారు  - దినదినము చనిపోయారు 

శరీరాశలను శిలువేసారు 

జనుల మెప్పు కోరనివారు - వధకు సిద్దమే అయినారు 

తుదకు ప్రభువులో మృతి పొందారు 

ధన్యజీవులు సర్వశ్రేష్ఠులు 

గొర్రెపిల్ల పెండ్లి విందుకు వారే అర్హులు 

పరిశుద్దులు యాజకులు - పరమతండ్రి ఆలయములో స్తంభములు 

కన్నీట కరిగిన స్మృతులు - గుండెల్లో ఎన్నో వ్యధలు 

విశ్వాసుల జీవితాలు - పలుకుతున్న సాక్ష్యాలు 

రాళ్ళ క్రింద నలిగిన వాళ్ళు - రంపాలకు తెగిపడినోళ్లు 

కత్తుల రక్తాక్షరాలు - క్రీస్తు కొరకు హతసాక్షులు 

పరదేశులు యాత్రికులు 

తండ్రికిష్టులైన  తనయులు - ఎంత యోగ్యులు 

నీతిమంతులు మార్గదర్శులు 

మాదిరి మనకుంచిపోయిన - మార్గదర్శులు 

2 comments:

  1. Anna excellent song ,naa life lo intha goppa song paricharya gurinchi,vaarupadina kastaala గురించి 10 నిమిషాలలోనే వాళ్ళ భారమెమిటొ మన బ్రతుకు ఎలా ఉండాలో చూపించావ్ 😢😢
    దేవునికి మహిమ కలుగును గాక

    ReplyDelete
  2. Chala goppa paata, Manasuni kattipadesthundhii, ippati generations ki idhi oka simple msg to know god

    ReplyDelete

Suggest your Song in the Comment.