కన్నీట కరిగిన స్మృతులు
కన్నీట కరిగిన స్మృతులు - గుండెల్లో ఎన్నో వ్యధలు
విశ్వాసుల జీవితాలు - పలుకుతున్న సాక్ష్యాలు
రాళ్ళ క్రింద నలిగిన వాళ్ళు - రంపాలకు తెగిపడినోళ్లు
కత్తుల రక్తాక్షరాలు - క్రీస్తు కొరకు హతసాక్షులు
పరదేశులు యాత్రికులు
తండ్రికిష్టులైన తనయులు - ఎంత యోగ్యులు
నీతిమంతులు మార్గదర్శులు
మాదిరి మనకుంచిపోయిన - మార్గదర్శులు
కన్నీట కరిగిన స్మృతులు - గుండెల్లో ఎన్నో వ్యధలు
విశ్వాసుల జీవితాలు - పలుకుతున్న సాక్ష్యాలు
రాళ్ళ క్రింద నలిగిన వాళ్ళు - రంపాలకు తెగిపడినోళ్లు
కత్తుల రక్తాక్షరాలు - క్రీస్తు కొరకు హతసాక్షులు
1. పలుమార్లు ఆకలిదప్పులు - అపరిమితముగా తిన్నదెబ్బలు
చెరసాలలో పొందిన యాతనలు
ఆపదలలో అనేక మారులు - ప్రాణాపాయములు నిందలు
జాగరణములు ఉపవాసములు
లోకమునకు నచ్చనివారు - తిరస్కారములు పొందారు
సకల జనులు ద్వేషించినవారు
కుటుంబములు కోల్పోయారు - దిగంబరులుగా మారారు
కొండలలో గుహలలో బ్రతికారు
ప్రణమిచ్చిన క్రీస్తు దాసులు
తమ సిలువను మోస్తుబ్రతికిన - గొప్ప వీరులు
ఆజ్ఞ మీరని ఆత్మపూర్ణులు - తమ పరుగును కడముట్టించిన
మార్గదర్శులు
కన్నీట కరిగిన స్మృతులు - గుండెల్లో ఎన్నో వ్యధలు
విశ్వాసుల జీవితాలు - పలుకుతున్న సాక్ష్యాలు
రాళ్ళ క్రింద నలిగిన వాళ్ళు - రంపాలకు తెగిపడినోళ్లు
కత్తుల రక్తాక్షరాలు - క్రీస్తు కొరకు హతసాక్షులు
2. హృదయమందు భద్రము వాక్యము
ఉపద్రవములో విస్వాసము - అలుపెరుగని యోధుల ప్రయాణము
సిలువను గూర్చిన ఉపదేశం - లోకానికి ఎంతో అల్పము
సిగ్గుపడని పాదము సుందరము
లోకమునకు వేడుకవారు - దినదినము చనిపోయారు
శరీరాశలను శిలువేసారు
జనుల మెప్పు కోరనివారు - వధకు సిద్దమే అయినారు
తుదకు ప్రభువులో మృతి పొందారు
ధన్యజీవులు సర్వశ్రేష్ఠులు
గొర్రెపిల్ల పెండ్లి విందుకు వారే అర్హులు
పరిశుద్దులు యాజకులు - పరమతండ్రి ఆలయములో స్తంభములు
కన్నీట కరిగిన స్మృతులు - గుండెల్లో ఎన్నో వ్యధలు
విశ్వాసుల జీవితాలు - పలుకుతున్న సాక్ష్యాలు
రాళ్ళ క్రింద నలిగిన వాళ్ళు - రంపాలకు తెగిపడినోళ్లు
కత్తుల రక్తాక్షరాలు - క్రీస్తు కొరకు హతసాక్షులు
పరదేశులు యాత్రికులు
తండ్రికిష్టులైన తనయులు - ఎంత యోగ్యులు
నీతిమంతులు మార్గదర్శులు
మాదిరి మనకుంచిపోయిన - మార్గదర్శులు
Anna excellent song ,naa life lo intha goppa song paricharya gurinchi,vaarupadina kastaala గురించి 10 నిమిషాలలోనే వాళ్ళ భారమెమిటొ మన బ్రతుకు ఎలా ఉండాలో చూపించావ్ 😢😢
ReplyDeleteదేవునికి మహిమ కలుగును గాక
Chala goppa paata, Manasuni kattipadesthundhii, ippati generations ki idhi oka simple msg to know god
ReplyDelete