NEEVE  KRUPAADHAARAMU
 నీవే కృపాధారము - త్రియేకదేవా
                నీవేక్షేమాధారము - నా యేసయ్యా         (2)
         నూతన బలమును - నవ నూతన కృపను      (2)
   నేటి వరకు దయచేయుచున్నావు
నిన్నేఆరాధింతును - పరిశుద్ధుడా
ఈ స్తోత్రగీతం నీకేనయ్యా
1. ఆనందిచితిని అనురాగబంధాల
                      ఆశ్రయపురమైన నీలో నేను                (2)
ఆకర్షింతివి ఆకాశము కంటే
                   ఉన్నతమైన నీ ప్రేమను చూపి              (2)
ఆపదలెన్నో అలుముకున్ననూ అభయమునిచ్చితివి 
ఆవేదనల అగ్నిజ్వాలలో అండగ నిలిచితివి
ఆలోచనవై ఆశ్రయమిచ్చి కాపాడుచున్నావు
నీకే ఈ ప్రేమగీతం అంకితమయ్యా
ఈ స్తోత్రగీతం నీకేనయ్యా
 నీవే కృపాధారము - త్రియేకదేవా
                నీవే క్షేమాధారము - నా యేసయ్యా         (2)
         నూతన బలమును - నవ నూతన కృపను      (2)
   నేటి వరకు దయచేయుచున్నావు
నిన్నేఆరాధింతును - పరిశుద్ధుడా
ఈ స్తోత్రగీతం నీకేనయ్యా
నీవే కృపాధారము - త్రియేకదేవా
2.  సర్వకృపానిధి సీయోను పురవాసి
                  నీ స్వాస్త్యముకై నను పిలచితివి          (2)
సిలువను మోయుచు నీ చిత్తమును
                  నెరవేర్చెదను సహనము కలిగి             (2)
శిధిలము కాని సంపదలెన్నోనాకై దాచితివి
సాహసమైన గొప్పకార్యములు నాకై చేసితివి
సర్వశక్తిగల దేవుడవై నడిపించుచున్నావు
నిన్నేఆరాధింతును - పరిశుద్ధుడా
ఈ స్తోత్రగీతం నీకేనయ్యా
 నీవే కృపాధారము - త్రియేకదేవా
                నీవే క్షేమాధారము - నా యేసయ్యా         (2)
         నూతన బలమును - నవ నూతన కృపను      (2)
   నేటి వరకు దయచేయుచున్నావు
నిన్నేఆరాధింతును - పరిశుద్ధుడా
ఈ స్తోత్రగీతం నీకేనయ్యా
నీవే కృపాధారము - త్రియేకదేవా
౩.  ప్రాకారములను దాటించితివి 
                 ప్రార్ధన వినెడి పావన మూర్తి            (2)
పరిశుద్ధులతో నను నిలిపితివి
               నీ కార్యములను నూతనపరచి            (2)
పావనమైన జీవనయాత్రలో విజయమునిచ్చితివి
పరమరాజ్యములో చేర్చుట కొరకు అభిషేకించితివి
పావనుడా నా అడుగులు జారక స్తిరపరచినావు
నిన్నేఆరాధింతును - పరిశుద్ధుడా
ఈ స్తోత్రగీతం నీకేనయ్యా
 నీవే కృపాధారము - త్రియేకదేవా
                నీవే క్షేమాధారము - నా యేసయ్యా         (2)
         నూతన బలమును - నవ నూతన కృపను      (2)
   నేటి వరకు దయచేయుచున్నావు
నిన్నేఆరాధింతును - పరిశుద్ధుడా
ఈ స్తోత్రగీతం నీకేనయ్యా
నిన్నేఆరాధింతును - పరిశుద్ధుడా
ఈ స్తోత్రగీతం నీకేనయ్యా