Halaman

Pages - Menu

Pages

Sunday, June 28, 2020

ALOCHINCHAVA - ENOSH KUMAR - FT. ISSAC SASTRY, FT. JERUSHA - Latest New Telugu Christian songs 2020

AALOCHINCHAVA O NESTHAM

ఆలోచి౦చావ – ఓ నేస్తం ఆలోచి౦చావ

ఏ సమయంలో ఏమవుతుందో – అని ఆలోచి౦చావ 

ఆలోచి౦చావ – ఓ నేస్తం ఆలోచి౦చావ

ఏ సమయంలో ప్రభు పిలుపు౦దో – అని ఎవరికి తెలియదుగా

ఈ సమయమ౦దే అ౦తా – కనుమరుగైపోతే

ఏ చోటికి నువ్వు వెళ్తావో – అని ఆలోచి౦చావ

ఈ సమయమ౦దే అ౦తా – విడిచి వెళ్ళ వస్తే

ఏ చోటికి నువ్వు వెళ్తావో – అని ఆలోచి౦చావ


ఆలోచి౦చావ – ఓ నేస్తం ఆలోచి౦చావ

ఏ సమయంలో ఏమవుతుందో – అని ఆలోచి౦చావ

ఆలోచి౦చావ – ఓ నేస్తం ఆలోచి౦చావ

ఏ సమయంలో ప్రభు పిలుపు౦దో – అని ఎవరికి తెలియదుగా


1. ఏదేదో అనుకుంటాము – ఏవేవో కలగ౦టాము

వ్యర్థమైన లోకాశలకు – లోబడుతూ ఉ౦టాము ॥2॥

ప్రభు నిన్ను చూచుచున్నాడని

తన ప్రేమతో పిలచుచున్నాడని

తెలిసి కూడా ఎ౦తో నిర్లక్ష్యం ..!

మేలుకో….. సోదరా ..!

రానైయు౦దిగా – ప్రభు రాకడ

మేలుకో ….. సోదరీ ..!

రానైయు౦దిగా – ప్రభు రాకడ


ఆలోచి౦చావ – ఓ నేస్తం ఆలోచి౦చావ

ఏ సమయంలో ఏమవుతుందో – అని ఆలోచి౦చావ 

ఆలోచి౦చావ – ఓ నేస్తం ఆలోచి౦చావ

ఏ సమయంలో ప్రభు పిలుపు౦దో – అని ఎవరికి తెలియదుగా


2. అన్నీ తెలుసనుకు౦టాము – నాకేదీ కాద౦టాము

తెలియకు౦డా సాతానుచే – మోసపోతూ ఉ౦టాము ॥2॥

ప్రభు నిన్ను చూచుచున్నాడని,

తన ప్రేమతో పిలచుచున్నాడని

తెలిసి కూడా ఎ౦తో నిర్లక్ష్యం ..!

మేలుకో….. సోదరా ..!

రానైయు౦దిగా – ప్రభు రాకడ

మేలుకో ….. సోదరీ ..!

రానైయు౦దిగా – ప్రభు రాకడ


ఆలోచి౦చావ – ఓ నేస్తం ఆలోచి౦చావ

ఏ సమయంలో ఏమవుతుందో – అని ఆలోచి౦చావ 

ఆలోచి౦చావ – ఓ నేస్తం ఆలోచి౦చావ

ఏ సమయంలో ప్రభు పిలుపు౦దో – అని ఎవరికి తెలియదుగా

ఈ సమయమ౦దే అ౦తా – కనుమరుగైపోతే

ఏ చోటికి నువ్వు వెళ్తావో – అని ఆలోచి౦చావ

ఈ సమయమ౦దే అ౦తా – విడిచి వెళ్ళ వస్తే

ఏ చోటికి నువ్వు వెళ్తావో – అని ఆలోచి౦చావ

          

Saturday, June 27, 2020

Talachukunte Chalunu | Talachunkunte Chalunaya | Calvary Temple | India

THALACHUKUNTE CHALUNU


తలచుకుంటే చాలును - ఓ యేసు నీ ప్రేమ

జల జల రాలును - కృతజ్ఞత  కన్నీళ్ళు     

తలచుకుంటే చాలును - కరిగించును రాళ్ళను

కల్వరి స్వరము - ఇది కల్వరి స్వరము

తలచుకుంటే చాలును..........


1. నీ మోమున ఊసిన ఉమ్ములు - నా మోహపు చూపు తుడిచెను

నీ చెంపను కొట్టిన దెబ్బలు  - నా నోటి శుద్ధి చేసెను         || 2 ||

నీ శిరస్సున గుచ్చిన ముండ్లు - నా మోసపు తలపులు త్రుంచెను   || 2 ||

ఎంత త్యాగ పురితమో నీ ప్రేమ.......

ఎంత క్షమ భరితమో నీ ప్రేమ........

తలచుకుంటే చాలును - ఓ యేసు నీ ప్రేమ

జల జల రాలును - కృతజ్ఞత  కన్నీళ్ళు

తలచుకుంటే చాలును..........


2. నీ దేహము చీరిన కొరడా - నా కామము చీల్చేను

నీ చేతుల కాళ్ళకు మేకులు - నా చీకటి దారి ముసేను    || 2 ||

సిలువ నేతుట్టి దారలు - నా కలుషమును కడిగి వేసెను    || 2 ||

ఎంత త్యాగ పురితమో నీ ప్రేమ.......

ఎంత క్షమ భరితమో నీ ప్రేమ........


తలచుకుంటే చాలును - ఓ యేసు నీ ప్రేమ

జల జల రాలును - కృతజ్ఞత  కన్నీళ్ళు

తలచుకుంటే చాలును - కరిగించును రాళ్ళను

కల్వరి స్వరము - ఇది కల్వరి స్వరము

తలచుకుంటే చాలును..........



             

Friday, June 26, 2020

Hosanna Ministries 30thalbum [Manoharuda- Song-7]“ANANDAM NEELONEA” Pas.JOHN WESLEY anna Song1080pHD

AANANDAM NEELONE

ఆనందం నీలోనే - ఆధారం నీవేగా

ఆశ్రయం నీలోనే - నా యేసయ్యా స్తోత్రహుడా

అర్హతెలేని నన్ను - ప్రేమించినావు

జీవింతును ఇలలో నీకోసమే సాక్ష్యార్తమై    || 2 ||

ఆనందం నీలోనే - ఆధారం నీవేగా

ఆశ్రయం నీలోనే - నా యేసయ్యా స్తోత్రహుడా


1. పదే పదే నిన్నే చేరగా - ప్రతిక్షణం నీవే ధ్యాసగా    || 2 ||

కలవరాల కోటలో - కన్నీటి బాటలో    || 2 ||

కాపాడే కవచముగా - నన్ను ఆవరించిన

దివ్యక్షేత్రమా - స్తోత్రగీతమా

|| ఆనందం నీలోనే ||


2. నిరతరం నీవే వెలుగని - నిత్యమైన స్వాస్థ్యం నీదని    || 2 ||

నీ సన్నిధి వీడకా - సన్నుతించి పాడనా     || 2 ||

నీకొరకే ధ్వజమెత్తి నిన్ను ప్రకటించన

సత్యవాక్యమే - జీవవాక్యమే

|| ఆనందం నీలోనే ||


౩. సర్వసత్యమే నా మార్గమై - సంఘక్షేమమే నా ప్రాణమై

లోకమహిమ చూడక - నీ జాడలు వీడకా  || 2 ||

నీతోనే నిలవాలి - నిత్యసీయోనులో

ఈ దర్శనం - నా ఆశయం


ఆనందం నీలోనే - ఆధారం నీవేగా

ఆశ్రయం నీలోనే - నా యేసయ్యా స్తోత్రహుడా

అర్హతెలేని నన్ను - ప్రేమించినావు

జీవింతును ఇలలో నీకోసమే సాక్ష్యార్తమై   

ఆనందం నీలోనే - ఆధారం నీవేగా

ఆశ్రయం నీలోనే - నా యేసయ్యా స్తోత్రహుడా

            

Thursday, June 25, 2020

Hosanna Ministries Corona Special Prayer Song [ Pas.John wesley & Pas.Ramesh & Pas.Abraham ]

DEVAA MAA PRARTHANA VINAVAA


దేవా మా ప్రార్థన వినవా

ఆవేదన ఆలకించవా   || 2 ||


1. నీ ప్రజల కన్నీరు చూసి దాటి - దాటి వేళ్ళకు ప్రభువా

మా  దేశ క్షేమము చూసే - ఆశ్రయమైన దేవుడవు

|| దేవా మా||


2. సూర్యుడే లేక వేకువ రాదే

కెరటాలు లేక సాగరము కాదే

నీవు లేక జీవించగాగలమా....!    || 2 |

కానరాక వ్యాధి మూలం

దేశమంతా శిలగామారే

కనులకాంతి చీకటాయే

జనుల ఘోష గగనమంటే

ఘోర శిక్ష భారమయే


నీవే రావా కన్నీరు చూసి - రక్షించుము మా దేశమును  || 2 ||

దేవా మా ప్రార్థన వినవా

ఆవేదన ఆలకించవా   || 2 ||



                

Wednesday, June 24, 2020

Mahima Neeke Telugu New Latest Worship song by Ebenezer Samavedam

MAHIMA NEEKE


స్తుతి చెల్లించుచున్నాము - మా నిండు హృదయాలతో ||2||

యేసు నీవే.......... నీవే......... మా ప్రభువు ||2||

మహిమ నీకే మహిమ నీకే ఆ.... ఆ....

మహిమ నీకే మహిమ నీకే




1. ఆత్మతో నింపు ప్రభు నిన్నే ఆరధింతును ||2||

ఎంతో ఇంక ఎంతో నీ నామము ఘనపరతును ||2||
 
మహిమ నీకే మహిమ నీకే ఆ.... ఆ....

మహిమ నీకే మహిమ నీకే



2.నా గమ్యం విలువైనది - నా మార్గం ఇరుకైనను ||2||

నా సంతృప్తి సమాధానం - ఓదార్పు నీవే యేసయ్యా ||2||

మహిమ నీకే మహిమ నీకే ఆ.... ఆ....

మహిమ నీకే మహిమ నీకే



స్తుతి చెల్లించుచున్నాము - మా నిండు హృదయాలతో ||2||

యేసు నీవే.......... నీవే......... మా ప్రభువు ||2||

మహిమ నీకే మహిమ నీకే ఆ.... ఆ....

మహిమ నీకే మహిమ నీకే


           

Tuesday, June 23, 2020

Ninu Nenu Viduvanayya | Raj Prakash Paul | Latest Telugu Christian Song 2020 | Prardhana Album | 4K

NINNU NENU VIDUVANAYYA


నిను నేను విడువనయ్యా నీదు ప్రేమన్ మరునయ్యా

నీ దయలోనే నను బ్రతికించయ్యా

నీ రూపులొనే తీర్చిదిద్దుమయ్యా జీవితమే నీదు వరమయ్యా

నీదు మేలుల్ నేను మరువనయ్యా...


1.  కష్టాలలో నేనుండగా నా వారే దూషించగా వేదనతో చింతించగా దేవా... ( 2 )

నీవే నా ఆథారం నీవే నా ఆదరణ నను విడువద్దయ్యా ప్రియ ప్రభు యేసయ్యా...

నీవే నా సర్వం నీవే నా సకలం నీ తోడుతోనే నను బ్రతికించయ్యా...

|| నిను నేను ||


2. సహాయమే లేకుండగా నిరీక్షనే క్షీణించగా దయతో రక్షించయ్యా దేవా...( 2 )

నీవే నా ఆథారం నీవే నాఆదరణ నను విడువద్దయ్యా ప్రియ ప్రభు యేసయ్యా...

నీవే నా సర్వం నీవే నా సకలం నీ తోడుతోనే నను బ్రతికించయ్యా...

|| నిను నేను ||


3. నీ నీడలో నివసించగా నీ చిత్తంబు నాకు తెలిసెగా నీ సాక్షిగా నెెేను బ్రతికెదా దేవా...( 2 )

నీవే నా ఆథారం నీవే నా ఆదరణ నను విడువద్దయ్యా ప్రియ ప్రభు యేసయ్యా...

నీవే నా సర్వం నీవే నా సకలం నీ తోడుతోనే నను బ్రతికించయ్యా...

|| నిను నేను ||


               

Naalo Navasinche || Manoharuda || Hosanna Ministries 30th Album [Manoharuda-Song-1] "MADHURA PREMA" Pas.JOHN WESLEY anna 1080p HD

NAALO NIVASINCHE NAA YESAIAH



నాలో నివసించే నా యేసయ్య - మనోహర సంపద నీవేనయ్యా    || 2 ||

మారని మమతల మహనీయుడ || 2 ||

కీర్తించి నిన్నే ఘనపరతునయ్యా !

మనసారా నిన్నే ప్రేమింతునయ్యా!! || 2 ||

నాలో నివసించే నా యేసయ్య - మనోహర సంపద నీవేనయ్యా  



1. మధురమైనది నీ స్నేహబంధం - మహిమగ నను మార్చిన వైనం  || 2 ||

నీ చూపులే నను కాచెను  - నీ బాహువే నను మోసెను    || 2 ||

ఏమిచ్చి నీ ఋణము నేతీర్చను

కీర్తించి నిన్నే ఘనపరతునయ్యా !

మనసారా నిన్నే ప్రేమింతునయ్యా!! || 2 ||

నాలో నివసించే నా యేసయ్య - మనోహర సంపద నీవేనయ్యా


2. వినయభావము ఘనతకు మూలం - నూతన జీవములో నడుపు మార్గం     ||2 ||

నా విన్నపం విన్నావులే - అరుదించెలే నీ వరములే     || 2 ||

ఏమని వర్ణింతును నీ కృపలను

కీర్తించి నిన్నే ఘనపరతునయ్యా !

మనసారా నిన్నే ప్రేమింతునయ్యా!! || 2 ||

నాలో నివసించే నా యేసయ్య - మనోహర సంపద నీవేనయ్యా


౩. మహిమ గలది నీ దివ్య రాజ్యం - తేజోవాసుల పరిశుద్ధ స్వాస్థ్యం    || 2 ||

సీయోనులో చేరాలనే నా ఆశయం నెరవేర్చుము || 2 ||

యేసయ్యా నిను చూచి హర్షింతునే

భువినేలు రాజ నీకే నా వందనం !

దివేనులు రాజ వేలాది వందనం !!    || 2 ||


నాలో నివసించే నా యేసయ్య - మనోహర సంపద నీవేనయ్యా    || 2 ||

మారని మమతల మహనీయుడ || 2 ||

కీర్తించి నిన్నే ఘనపరతునయ్యా !

మనసారా నిన్నే ప్రేమింతునయ్యా!! || 2 ||

నాలో నివసించే నా యేసయ్య - మనోహర సంపద నీవేనయ్యా  



                 

Monday, June 22, 2020

Nee Prema Nalo Song || Hosanna Ministries 30th Album [Manoharuda-Song-1] "MADHURA PREMA" Pas.JOHN WESLEY anna 1080p HD


NEE PEMA NALO MADHURAMAINADI


నీ ప్రేమ నాలో మధురమైనది - అది నా ఊహకందని క్షేమశికరము         ||2||

ఏరికోరుఉన్నావు ప్రేమచూపి నన్ను - పరవశించి నాలో మహిమపరతు నిన్నే

సర్వకృపానిధి నీవు సర్వాధికారివి నీవు - సత్యస్వరూపివి నీవు ఆరధింతును నిన్నే
 
నీ ప్రేమ నాలో


1. చేరితి నిన్నే విరిగిన మనసుతో - కాదనలేదే నా మానవులు నీవు    || 2 ||

హృదయము నిండిన గానం - నను నడిపే ప్రేమ కావ్యం
 
నిరతము నాలో నీవే చెరగని - దివ్య రూపం    || 2 ||

ఇది నీ బాహూబంధాల అనుబంధమా?

తేజోవిరాజ స్తుతి మహిమలు నీకే - నా యేసు రాజ ఆరాధన నీకే      || 2 ||

        నీ ప్రేమ నాలో


2. నా ప్రతిపదములో జీవము నీవే - నా ప్రతిఅడుగులో విజయము నీవే     || 2 ||

ఎన్నడు విడువని ప్రేమ - నిను చేరే క్షణమురాదా

నీడగ నాతో నిలిచే - నీ కృపయే నాకు చాలును   || 2 ||

ఇది నీ ప్రేమ కురిపించు హేమంతమా?

తేజోవిరాజ స్తుతి మహిమలు నీకే - నా యేసు రాజ ఆరాధన నీకే      || 2 ||

నీ ప్రేమ నాలో


3. నీ సింహాసనము నను చేర్చుటకు - సిలువను మోయుట నేర్పించితి   || 2 ||

కొండలు లోయలు దాటే - మహిమత్మతో నింపినావు

దయగల ఆత్మతో నింపి - సమభూమిపై నడిపినావు        || 2 ||

ఇది నీ ఆత్మ బంధముకై సంకేతమా?

తేజోవిరాజ స్తుతి మహిమలు నీకే - నా యేసు రాజ ఆరాధన నీకే      || 2 ||



నీ ప్రేమ నాలో మధురమైనది - అది నా ఊహకందని క్షేమశికరము         ||2||

ఏరికోరుఉన్నావు ప్రేమచూపి నన్ను - పరవశించి నాలో మహిమపరతు నిన్నే

సర్వకృపానిధి నీవు సర్వాధికారివి నీవు - సత్యస్వరూపివి నీవు ఆరధింతును నిన్నే

  నీ ప్రేమ నాలో


             

"Matallo cheppalenidhi Yesu Neeprema okkate" Joshua Gariki's Video song || 2020

Matallo cheppalenidhi Yesu Neeprema okkate



పల్లవి: మాటల్లో చెప్పలేనిది - స్వరములతో పాడలేనిది


కవితలలో వ్రాయలేనిది - ఎవరూ వర్ణించలేనిది


అ. ప: యేసూ నీప్రేమఒక్కటే... యేసూ నీ ప్రేమ ఒక్కటే "2"    

                                                                                                                "మాటల్లో"


1. స్వార్థంతో నిండినా ఈలోక ప్రేమాలోనా

మోసముతో కూడినా ఈ మనుషుల ప్రేమ మధ్య"2"

కల్మషమేలేనిది కరుణతో నిండినది"2" 

కలవరమే తీసినది - కన్నీటిని తుడిచినది"2" 

                                                                                                    "యేసూ నీ ప్రేమ ఒక్కటే"


2. పాపముతో నిండినా ఈ లోకప్రేమాలోన


శాపముతో కూడిన - ఈ మనుష్యుల ప్రేమమధ్య"2"


లోకాన్ని ప్రేమించి - రక్తాన్ని చిందించి


సిలువలో మరణించినది - శిక్షను భరియించినది"2"

                                                                                                       
"యేసూ నీ ప్రేమ ఒక్కటే"


"మాటల్లో చెప్పలేనిది"


Lyric, Sung & Produced by : Joshua Gariki
Tune: Pastor.M.Jyothi raju
Music:J.K.Christopher
Mixed and Mastered by: J.K.Vinay & Sam k srinivas
  

                 

Saturday, June 6, 2020

Oo Manishi Oho Manishi Song 2020 || by I FOR GOD VIJAY PRASAD REDDY || COVID-19 || ఓ మనిషి.. ఓహో మనిషి

                  
        
      Oo Manishi Oho Manishi



                             

                           ఓ మనిషి.. ఓహో మనిషి

మన చేతలు బాగుండుంటే ఈ చేతులు కడిగేదుందా

                           ఓ మనిషి..ఓహో మనిషి

మన హృదయం బాగుండుంటే ఈ ముఖమును కప్పేదుందా

                నడిసంద్రంలో మునిగాక ఓడలు చేద్దామా?

         చేతులు కాలిన తరువాత ఆకులు పట్టుకుందామా?

         స్వార్థము నిలువునా నిండి ప్రకృతి పాడు చేసామా?

         కూర్చుని ఉన్న కొమ్మను నరికి దుఃఖిస్తూన్నామా?

ఓ మనిషి..ఓహో మనిషి మన చేతలుబాగుండుంటే?మన హృదయం

బాగుండుంటే?ఈ చేతులు కడిగేదుందా?ఈ ముఖమును కప్పేదుందా?




1. మనిషిని ప్రేమించి దేవుడు సృష్టిని చేసాడు... మనిషిని ఏలిక చేసాడు.(2)

   మనసున గర్వించి మనిషి మార్పులు చేసాడు.. ప్రకృతి వికృతి చేసాడు.(2)

              గాలి కాలుష్యం నీరు కాలుష్యం భూమి కాలుష్యం ఏమైంది.

          తిండి కాలుష్యం మందు కాలుష్యం చాలా ఆలస్యం అయ్యింది.

        పొలము కాలుష్యం ఫలము కాలుష్యం బ్రతుకు పెడదారి పట్టింది.

            మనిషి కాలుష్యం మనసు కాలుష్యం ప్రేమ చల్లారిపోయింది.

ఓ మనిషి..ఓహో మనిషి మన నడవడి బాగుండుంటే ఈ విపత్తు వచ్చేదుందా?

ఓ మనిషి..ఓహో మనిషి మన ఆశకు హద్దులు ఉంటే ఇంట్లో బంధీలయ్యేదుందా?



2.         ధనమే దేవుడని మనిషి డబ్బును కొలిచాడు ప్రాణము కొనగలడా ఇప్పుడు.(2)

             ప్రపంచ వేదికపై  నేనే రాజును అన్నాడు క్రిములకు భయపడుతున్నాడు.(2)

                           ఆస్తి ఎంతున్నా కీర్తి ఎంతున్నా పదవి ఏదైనా ఏముంది?

                      మరణసమయాన ధనము అక్కరకు రాదనే నిజము తెలిసింది.

                       ఎవడు ఉన్నోడు ఎవడు లేనోడు వ్యాధి గర్వాన్ని అణిచింది.

                  సాటి మనుషులకు సాయపడమంటూ దైవనియమాన్ని నేర్పింది.

        ఓ మనిషి..ఓహో మనిషి ఇకనైనా కన్నులు తెరిస్తే మన భవిష్యత్తు బాగుండదా?

    ఓ మనిషి..ఓహో మనిషి మన తప్పులు దిద్దుకు మసలితే దైవానుగ్రహం లభించదా?

ప్రళయజలల్లో మునగక ముందే ఓడలు చేద్దామా? అగ్ని జ్వాలల్లో కాలకముందే ఆలోచిద్దామా?

                                స్వార్థం కంచెలు తెంచి మనిషిని మనిషిగా చూద్దామా?

                                       ప్రకృతి ఒడిలో దైవం నీడలో ఆనందిద్దామా?

                                                     ఓ..మనిషి ఓహో మనిషి

                                                     మన చేతలు బాగుండాలి

     మన హృదయం బాగుండాలి సాటి మనుషిని ప్రేమించాలి ఆ దైవం కరుణిచాలి



ఈ పాట విన్నటువంటి ప్రియులైన సహోదరీ సహోదరులందరికీ మా ధన్యవాదములు..ఈ లాక్ 
డౌన్ సమయంలో సత్య సంబంధ మైన ఈ పాట అనేకులకు మేలుకొలుపుగా ఉండాలి గనుక మీకు 
ఇష్టమైతే తప్పకుండా ఈ పాట యుట్యూబ్ లింక్ కాపీ చేసి మీ వాట్సప్ , Facebook 
గ్రూపుల్లో Share చేసి అనేకులను వెలిగించగలరని ఆశిస్తున్నాము..