Pages - Menu

Pages

Thursday, March 25, 2021

Sthotram Chellinthumu Song Telugu Lyrics || స్తోత్రం చెల్లింతుము Song Telugu Lyrics | Dr Jayapaul | Telugu Christian Song

Sthotram Chellinthumu Song

 Telugu Lyrics

స్తోత్రం చెల్లింతుము |

 Dr Jayapaul | Telugu Christian Song




స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము  

                      యేసు నాథుని మేలులు తలంచి          ||స్తోత్రం||

 

దివారాత్రములు కంటిపాపవలె కాచి (2)  

                    దయగల హస్తముతో బ్రోచి నడిపించితివి (2)       ||స్తోత్రం||  

 

గాడాంధకారములో కన్నీటి లోయలలో (2)  

                   కృశించి పోనీయక కృపలతో బలపరచితివి (2)      ||స్తోత్రం||

 

సజీవ యాగముగా మా శరీరము సమర్పించి (2)  

                   సంపూర్ణ సిద్దినొంద శుద్ధాత్మను నొసగితివి (2)      ||స్తోత్రం||

 

సీయోను మార్గములో పలుశోధనలు రాగా (2)  

                 సాతాన్ని జయించుటకు విశ్వాసము నిచ్చితివి (2)     ||స్తోత్రం|| 

 

సిలువను మోసుకొని సువార్తను చేపట్టి (2)  

                     యేసుని వెంబడింప ఎంత భాగ్యము నిచ్చితివి (2)       ||స్తోత్రం||  

 

పాడెద హల్లెలూయా మరనాత హల్లెలూయా (2)  

                  సద పాడెద హల్లెలూయా ప్రభుయేసుకే హల్లెలూయా (2)      ||స్తోత్రం|| 


No comments:

Post a Comment

Suggest your Song in the Comment.