Pages - Menu

Pages

Thursday, March 25, 2021

Yehova Naa Balama Song Telugu Lyrics || యెహోవా నా బలమా Telugu Song Lyrics || Telugu old christian song Lyrics

Yehova Naa Balama 

Song Telugu Lyrics ||

 యెహోవా నా బలమా 

Telugu Song Lyrics || 

Telugu old christian song Lyrics

 

 
 
 
యెహోవా - నా బలమా  
 
యధార్థమైనది నీ మార్గం
 
పరిపూర్ణమైనది  నీమార్గం
 
 
 
1. నా శత్రువులు నను చుట్టినను
 
నరకపు పాశము లరికట్టినను
 
వరదవలె భక్తిహీనులు పొర్లిన
 
                                                     విడువక నను ఎడబాయనిదేవా   ||యెహోవా - నా బలమా  ||
 
 
2. దయగల వారిపై దయచూపించును
 
కఠినుల యెడలను వికటము చూపును
 
గర్విష్టుల యొక్క గర్వము నణచును
 
                                                  సర్వము నెరిగిన సర్వాధికారి    ||యెహోవా - నా బలమా  || 
 
 
 
3. మరణపు టురులలో మరువక మొరలిడ
 
ఉన్నత దుర్గమై రక్షణ శృంగమై
 
తన యాలయములో నా మొర వినెను
 
                                         అదరెను ధరణి భయకంపముచే ||యెహోవా - నా బలమా  || 
 
 
 
4. పౌరుషము గల ప్రభు కోపింపగ
 
పర్వతముల పునాదులువణకెను
 
తన నోట నుండి వచ్చిన యగ్ని
 
                                                   దహించి వేసెను వైరులనెల్ల     ||యెహోవా - నా బలమా  || 
 
 
 
5. మేఘములపై ఆయన వచ్చును  
 
మేఘములను తన మాటుగ జేయును
 
ఉరుములు మెరుపులు మెండుగజేసి
 
                                              అపజయమిచ్చును అపవాదికిని ||యెహోవా - నా బలమా  || 
 
 
 
6. నా దీపమును వెలిగించువాడు
 
నా చీకటిని వెలుగగ  జేయును
 
జలరాసులనుండి బలమైన చేతితో
 
                                              వెలుపల జేర్చిన  బలమైన దేవుడు ||యెహోవా - నా బలమా  ||  
 
 
 
7. నా కాళ్ళను లేడి కాళ్ళగజేసి
 
ఎత్తైన స్థలములో శక్తితో నిలిపి
 
రక్షణ కేడెము నాకందించి
 
                                                  అక్షయముగ తన పక్షము జేర్చిన ||యెహోవా - నా బలమా  ||  
 
 
 
8. యెహోవా జీవముగల దేవా
 
బహుగా స్తుతులకు అర్హుడవీవె
 
అన్య జనులలో ధన్యత జూపుచు
 
                                                    హల్లెలూయ స్తుతి గానము చేసెద   ||యెహోవా - నా బలమా  ||

No comments:

Post a Comment

Suggest your Song in the Comment.