Halaman

Pages - Menu

Pages

Monday, January 31, 2022

Sashwatha Krupanu Song Lyrics || శాశ్వత కృపనను Song Lyrics || నా హృదయమెంతో జీవము Song Lyrics || Naa Hrudayamentho Song Lyrics || Pas.John Wesley || Hosanna Ministries Songs

    

 
శాశ్వత కృపను నేను తలంచగా  
                    కానుకనైతిని నీ సన్నిధిలో (2)      ||శాశ్వత||
 
 
నా హృదయమెంతో జీవముగల దేవుని  
దర్శింప ఆనందముతో కేక వేయుచున్నది (2)  
                    నా దేహమెంతో నీకై ఆశించే (2)         ||శాశ్వత||
 
 
భక్తిహీనులతో నివసించుటకంటెను  
నీ మందిరావరణములో ఒక్క దినము గడుపుట (2)  
                 వేయిదినాల కంటే శ్రేష్టమైనది (2)       ||శాశ్వత|| 
 
 
సీయోను శిఖరాన సిలువ సితారతో  
సింహాసనము ఎదుట క్రొత్త పాట పాడెద (2)  
                   సీయోను రారాజువు నీవేగా (2)      ||శాశ్వత|| 
 
 
నూతనమైన ఈ జీవ మార్గమందున 
 నూతన జీవము ఆత్మాభిషేకమే (2) 
                   నూతన సృష్టిగా నన్ను మార్చెను (2)      ||శాశ్వత 

Tuesday, January 25, 2022

Sarvadhikarivi Sarvagnudavu Song Lyrics || సర్వాధికారివి సర్వజ్ఞుడవు సంపూర్ణ సత్యస్వరూపివి Song Lyrics || Hosanna Ministries Songs



సర్వాధికారివి సర్వజ్ఞుడవు సంపూర్ణ సత్య స్వరూపివి నీవు ||2||

దివిలోనున్న ఆనందమును ధరణిలో నేను అనుభవింప

    మహిమాత్మతో నను నింపితివా ||2||



    1. అతీసుందరుడా నా స్తుతి సదయుడ

    కోటి సూర్య కాంతులైనా నీతో సమమగునా ||2||

    ఎనలేనే నీ ఘనకార్యములు తలచి

    స్తుతించుచు నిను నే మహిమపరతును ||2||   ||సర్వాధి||



    2. బలశౌర్యములుగల నా యేసయ్యా

    శతకోటి సైన్యములైనా నీకు సాటి అగుదురా

    మారవే నీ సాహసకార్యములు యెన్నడు

    ధైర్యముగా నిను వెంబడింతును ||2||   ||సర్వాధి||



    3. సర్వజగద్రక్షకూడా - లోకరాజ్యపాలక

    భూరాజులెవ్వరినైన నీతో పోల్చగలనా ||2||

    బలమైన నీ రాజ్యస్థాపనకై  నిలిచి

    నిరీక్షణతో నే సాగిపోదును ||2||   ||
    సర్వాధి||

Sarirarevvaru Naa Priyudaina Yessayaku Song Lyrics || సరిరారెవ్వరూ నా ప్రియుడైన యేసయ్యకు Song Lyrics || Hosanna Ministries Songs Lyrics


సరిరారెవ్వరూ నా ప్రియుడైన యేసయ్యకు -2


సర్వము నెరిగిన సర్వేశ్వరునికి

సరిహద్దులు లేని పరిశుద్ధునికి -2



1. నమ్మదగిన వాడే నలుదిశల నెమ్మది కలుగజేయువాడే -2

నాజీరు వ్రతము జీవితమంతా అనుసరించినాడే

నాకై నిలువెల్ల సిలువలో నలిగి కరిగినాడే -2   ||సరిరారెవ్వరూ||




2. ఆరోగ్య ప్రదాతయే సంపూర్ణ స్వస్థత అనుగ్రహించువాడే -2

ఆశ్చర్య క్రియలు జీవితమంతా చేయుచు తిరిగినాడే

నాకై కొరడాల దెబ్బలను అనుభవించినాడే -2   ||సరిరారెవ్వరూ||




3. పునరుత్థానుడే జయశీలి మృతిని జయించి లేచినాడే -2

శ్రేష్ఠమైన పునరుత్థాన బలము యిచ్చినాడే

నాకై అతిత్వరలో మహిమతో రానైయున్నావాడే -2   ||సరిరారెవ్వరూ||

Sarva Yugamulalo Sajivudavu Song Lyrics || సర్వ యుగములలో సజీవుడవు Song Lyrics || Hosanna Ministries Songs Lyrics


సర్వ యుగములలో సజీవుడవు

సరిపోల్చగలనా నీ సామర్ధ్యమును

కొనియాడదగినది నీ దివ్య తేజం

నా ధ్యానం - నా ప్రాణం - నీవే యెసయ్యా



1. ప్రేమతో ప్రాణమును అర్పించినావు

శ్రమల సంఖెళ్ళైన శత్రువు కరుణించువాడవు నీవే

శూరులు నీ యెదుట వీరులు కారెన్నడు

జగతిని జయించిన జయశీలుడా   ||సర్వ|| 



2. స్తుతులతో దుర్గమును స్ధాపించువాడవు

శ్రుంగధ్వనులతొ సైన్యమును నడిపించువాడవు నీవే

నీయందు ధైర్యమును నే పొందుకొనెదను

మరణమును గెలిచిన బహుధీరుడా   ||సర్వ|| 



3. కృపలతో రాజ్యమును స్ధిరపరచు నీవు

బహుతరములకు శొభాతిశయముగా జేసితివి నన్ను

నెమ్మది కలింగించే నీ బాహుబలముతొ

శతృవునణచిన బహుశూరుడా   ||సర్వ|| 

Sumadhura Swaramula Song Lyrics || సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో Song Lyrics || Hosanna Ministries Songs Lyrics


సుమధుర స్వరముల గానాలతో – వేలాది దూతల గళములతో

కొనియాడబడుచున్న నా యేసయ్యా – నీకే నా ఆరాధన (2)

మహదానందమే నాలో పరవశమే

నిన్ను స్తుతించిన ప్రతీక్షణం (2) ||సుమధుర||



1. ఎడారి త్రోవలో నే నడిచినా – ఎరుగని మార్గములో నను నడిపినా

నా ముందు నడచిన జయవీరుడా – నా విజయ సంకేతమా (2)

నీవే నీవే – నా ఆనందము

నీవే నీవే – నా ఆధారము (2) ||సుమధుర||



2. సంపూర్ణమైన నీ చిత్తమే – అనుకూలమైన సంకల్పమే

జరిగించుచున్నావు నను విడువక – నా ధైర్యము నీవేగా (2)

నీవే నీవే – నా జయగీతము

నీవే నీవే – నా స్తుతిగీతము (2) ||సుమధుర||



3. వేలాది నదులన్ని నీ మహిమను – తరంగపు పొంగులు నీ బలమును

పర్వత శ్రేణులు నీ కీర్తినే – ప్రకటించుచున్నవేగా (2)

నీవే నీవే – నా అతిశయము

నీకే నీకే – నా ఆరాధన (2) ||సుమధుర||

Madhuram Madhuram Naa Priya Song Lyrics || మధురం మధురం నా ప్రియ యేసుని చరితం మధురం Song Lyrics || Hosanna Ministries Songs Lyrics


మధురం మధురం నా ప్రియ యేసుని చరితం మధురం

శాశ్వతం శాశ్వతం నా ప్రభు కృపయే నిరంతరం (2)

దీన మనస్సు – దయ గల మాటలు

సుందర వదనం – తేజోమయుని రాజసం (2)  ||మధురం||



1. ఆశ్చర్యకరమైన వెలుగై దిగివచ్చి – చీకటిలో ఉన్న వారిని

బంధింప బడియున్న వారిని విడుదల చేయుటకు (2)

నిరీక్షణ కలిగించి వర్దిల్ల చేయుటకు

యేసే సరిపాటి నా యేసే పరిహారి (2) ||మధురం||



2. పరిపూర్ణమైన నెమ్మదినిచ్చుటకు – చింతలన్నియు బాపుటకు

ప్రయాసపడు వారి భారము తొలగించుటకు (2)

ప్రతిఫలము నిచ్చి ప్రగతిలో నడుపుటకు

యేసే సరిపాటి నా యేసే పరిహారి (2) ||మధురం||



3. కలవర పరిచే శోధనలెదురైన – కృంగదీసే భయములైనను

ఆప్యాయతలు కరువైన ఆత్మీయులు దూరమైనా (2)

జడియకు నీవు మహిమలో నిలుపుటకు

యేసే సరిపాటి నా యేసే పరిహారి (2) ||మధురం||

Sarvonathuda Neeve Song Lyrics || సర్వోన్నతుడా - నీవే నాకు ఆశ్రయదుర్గము Sarvonathuda Neeve Song Lyrics || Telugu Christian Songs Lyrics


సర్వోన్నతుడా - నీవే నాకు ఆశ్రయదుర్గము -2


ఎవ్వరులేరు - నాకు ఇలలో -2

ఆదరణ నీవెగా -ఆనందం నీవెగా -2



1. నీ దినములన్నిట ఎవ్వరు నీ ఎదుట - నిలువలేరని యెహోషువాతో -2

వాగ్దానము చేసినావు - వాగ్దానా భూమిలో చేర్చినావు -2 ॥ సర్వో ॥



2. నిందలపాలై నిత్య నిబంధన - నీతో చేసిన దానియేలుకు -2

సింహాసనమిచ్చినావు - సింహాల నోళ్లను మూసినావు -2 ॥ సర్వో ॥



3. నీతి కిరీటం దర్శనముగా - దర్శించిన పరిశుద్ధ పౌలుకు -2

విశ్వాసము కాచినావు - జయజీవితము నిచ్చినావు -2 ॥ సర్వో ॥

Sugunaala Sampannudaa Song Lyrics || సుగుణాల సంపన్నుడా – స్తుతి గానాల వారసుడా Song Lyrics || Telugu Christian Songs Lyrics


సుగుణాల సంపన్నుడా – స్తుతి గానాల వారసుడా

జీవింతును నిత్యము నీ నీడలో

ఆస్వాదింతును నీ మాటల మకరందము



1. యేసయ్య నీతో జీవించగానే

నా బ్రతుకు బ్రతుకుగా మారేనులే

నాట్యమాడేను నా అంతరంగము

ఇది రక్షణానంద భాగ్యమే ||సుగుణాల||



2. యేసయ్య నిన్ను వెన్నంటగానే

ఆజ్ఞల మార్గము కనిపించెనే

నీవు నన్ను నడిపించాగలవు

నేను నడవవలసిన త్రోవలో ||సుగుణాల||



3. యేసయ్య నీ కృప తలంచగానే

నా శ్రమలు శ్రమలుగా అనిపించలేదే

నీవు నాకిచ్చే మహిమ ఎదుట

ఇవి ఎన్నతగినవి కావే ||సుగుణాల||

Chuchuchunna Devudavu Song Lyrics || చూచుచున్న దేవుడవు నీవే యేసయ్య Song Lyrics || Telugu Christian Songs Lyrics



చూచుచున్న దేవుడవు నీవే యేసయ్య చూడముచ్చటాయెనే

సుకుమార సుమములైన నీ నేత్రాలంకృతము



1.పశ్చాత్తాపము కలుగునే -  నీ దయగల చూపులతో

క్షమించబడుదురు ఎవరైనా రక్తప్రోక్షణతో 

అప్యాయతకు నోచుకొనని నను చేరదీసిన కృపా సాగరా!  

                                                                 || చూచుచున్న ||



2. అగ్నిజాలామయమే నీ చూపులవలయాలు

తప్పించుకొందురాఏవరైన ఎంతటిఘనులైనా!

అగ్ని వంటి శోధనను తప్పించితివవే దయాసాగరా!

                                                                || చూచుచున్న ||

Mahima Swarupuda Song Lyrics || మహిమ స్వరూపుడా మృత్యుంజయుడా Song Lyrics || Hosanna Ministries Songs


మహిమ స్వరూపుడా మృత్యుంజయుడా

మరణపుముల్లును విరిచినవాడా

నీకే స్తోత్రములు నా యేసయ్యా నీకే స్తోత్రములు

నీకే స్తోత్రములు నా యేసయ్యా నీకే స్తోత్రములు



1. నీ రక్తమును నా రక్షణకై

బలియాగముగా అర్పించినావు

నీ గాయములద్వారా స్వస్థతనొంది

అనందించెద నీలో నేను

||మహిమ స్వరూపుడా||



2.విరిగిన మనస్సు నలిగినా హృదయం

నీ కిష్టమైన బలియాగముగా

నీ చేతితోనే విరిచిన రోట్టెనై

ఆహారమౌదును అనేకులకు

||మహిమ స్వరూపుడా||



3. పరిశుద్ధత్మ ఫలముపొంది

పరిపూర్ణమైన జ్యేష్టుల సంఘమై

సీయోను రాజా నీ ముఖము చూడ

ఆశతో నేను వేచియున్నాను

||మహిమ స్వరూపుడా||

Sthuthiki Paathruda Song Lyrics || స్తుతికి పాత్రుడా స్తోత్రార్హుడా Song Lyrics || Hosanna Ministries Songs


స్తుతికి పాత్రుడా - స్తోత్రార్హుడా


శుభప్రదమైన నిరీక్షణతో - శుభప్రదమైన నిరీక్షణతో

జయగీతమే పాడెద- అ - ఆ - ఆ

జయగీతమే పాడెద- అ - ఆ - ఆ





1. నా కృప నిన్ను విడువదంటివే -2

నా కృప నీకు చాలునంటివే నాకేమి కొదువ -2   ||స్తుతికి||



2. ప్రభువా నీ వలన పొందిన ఈ -2

పరిచర్యనంతయు తుదివరకు కృపలో ముగించెద -2   ||స్తుతికి||



3. ఇహపరమందున నీవే నాకని -2

ఇక ఏదియు నాకు అక్కరలేదని స్వాస్థ్యమే నీవని -2   ||స్తుతికి||

Sajeevudavaina Yesayyaa Song Lyrics || సజీవుడవైన యేసయ్యా Song Lyrics || Hosanna Ministries Songs



సజీవుడవైన యేసయ్యా

నిన్నాశ్రయించిన నీ వారికి

సహాయుడవై తృప్తి పరచితివే

సముద్రమంత సమృద్ధితో (2)

ఆనందించెద నీలో – అనుదినము కృప పొంది

ఆరాధించెద నిన్నే – ఆనంద ధ్వనులతో (2)



1. ధన రాసులే ఇలా – ధనవంతులకు – ఈ లోక భాగ్యము

దాచిన మేలులెన్నో – దయచేసినావే – ఇహ పరమున నాకు (2)

శ్రమల మార్గమును నిరీక్షణ ద్వారముగా చేసితివి

శ్రేష్టమైన నీ వాగ్ధానములతో (2) ||సజీవుడవైన||



2. క్షేమము నొందుటయే – సర్వ జనులకు – ప్రయాసగా మారే

క్షేమాధారము నీవై – దీర్ఘాయువుతో – సంతృప్తి పరతువు నన్ను (2)

నిత్య నిబంధనగా నీ వాత్సల్యమును చూపితివే

నిత్యమైన నీ సత్య వాక్యముతో (2) ||సజీవుడవైన||



3. నలువది ఏండ్లు – నీ స్వాస్థ్యమును – మోసినది నీవే

నీ కృప కాంతిలో – నా చేయి విడువక – నడిపించుచున్నది నీవే (2)

పరమ రాజ్యములో మహిమతో నింపుటకు అనుగ్రహించితివే

పరిపూర్ణమైన నీ ఉపదేశమును (2) ||సజీవుడవైన||