Pages - Menu

Pages

Monday, January 17, 2022

Avadhule lenidhi Songs Lyrics || అవధులే లేనిది Songs Lyrics || (విజయశీలుడా) || hosanna ministries new song-2017


అవధులే లేనిది దివ్యమైన నీ కృప

అనంతమైనది ఆశ్చర్యమైనది (2)

యేసయ్యా నాపై నీవు చూపిన కృప

అమూల్యమైనది వర్ణించలేనిది (2) ||అవధులే||



1. ఊహించలేని హృదయానందమును

దుఃఖమునకు ప్రతిగా దయచేసినావు (2)

భారమెక్కువైనా తీరం కడుదూరమైనా

నీపై ఆనుకొందును

నేను గమ్యం చేరుకొందును (2) ||అవధులే||



2. సరిపోల్చలేని మధురమైన అనుభవం

వింతైన నీ ప్రేమలో అనుభవింపజేశావు (2)

సౌందర్యమైన అతిపరిశుద్ధమైన

నీ రూపము తలచుకొందును

నేను నీ కోసమే వేచియుందును (2) ||అవధులే||



3. లెక్కించలేని అగ్ని శోధనలో

ప్రయాసమునకు తగిన ఫలములిచ్చినావు (2)

వాడబారని కిరీటము నే పొందుటకు

వెనుకున్నవి మరచి

నేను లక్ష్యము వైపు సాగెద (2) ||అవధులే||

No comments:

Post a Comment

Suggest your Song in the Comment.