Pages - Menu

Pages

Monday, January 17, 2022

Dayagala hrudayudavu Song Lyrics || దయగల హృదయుడవు Song Lyrics || Hosanna Songs


దయగల హృదయుడవు

నీ స్వస్త్యమును ఎన్నడు ఎడబాయవు

ఎడారిలో ఊటలను

జలరాసులలో త్రోవను ఏర్పరచువాడవు

సర్వలోకము నీకు నమస్కరించి

నిన్ను కొనియాడును     || దయగల ||



1. సత్యస్వరూపి నీ దివ్య వాక్యమే నాకు జీవమార్గము

సారము వెదజల్లు నీ జాడలె నాకు జీవన గమనము (2)

శ్రేష్టమైన ఉపదేశముతో జీవముగలిగిన సంఘములో

నింపుచున్నావు దీవెనలతో నను నడుపుచున్నావు సమృద్దితో (2) 

|| దయగల ||



2. పరిశుద్దుడా నీ దివ్య యోచనలే నాకు ఎంతో ఉత్తమము

పరిశుద్దుల సహవాసమై నాకు క్షేమధారాము (2)

విశ్వాసమందు నిలకడగా నీ రాకడ వరకు మెలకువగా

విసుగక నిత్యము ప్రార్ధింతును నిను నిశ్చలమైన నిరీక్షణతో (2)

|| దయగల ||



3. పరిపూర్ణుడా నీ దివ్య చిత్తమే నాకు జీవాహారము

పరవాసిగా జీవించుటే నాకు నిత్య సంతోషము (2)

ఆశ్రయమైనది నీ నామమే సజీవమైనది నీ త్యాగమే

ఆరాధింతును నా యేసయ్యా నిను నిత్యము కీర్తించి ఘనపరతును (2)

|| దయగల ||

No comments:

Post a Comment

Suggest your Song in the Comment.