భూమ్యాకాశములు సృజించిన యేసయ్యా నీకే స్తోత్రం
నీ ఆశ్చ్యర్యమైన క్రియలు నేనెలా మరచిపోదును
హల్లెలూయ… లూయ… హల్లెలూయ (4)
1.బానిసత్వమునుండి, శ్రమలబారినుండి, విడిపించావు నన్ను
దీన దశలో నేనుండగా, నను విడువనైతివి (2) IIభూమ్యాII
2.జీవాహారమై, నీదువాక్యము, పోషించెను నన్ను
ఆకలితో అల్లాడగా, నను తృప్తిపరచితివి (2) IIభూమ్యాII
3.భుజంగములను, అణచివేసి, కాచినావు నన్ను
ఆపదలో చిక్కుకొనగా, నను లేవనెత్తితివి(2) IIభూమ్యాII
4.నూతన యెరూషలేమ్, నిత్య నివాసమని, తెలియజేసితివి
నిట్టూర్పులలో వుండగా, నను ఉజ్జీవపరచితివి(2) IIభూమ్యాII
No comments:
Post a Comment
Suggest your Song in the Comment.