Pages - Menu

Pages

Tuesday, January 11, 2022

Naa Jeevithana Kurisene Song Lyrics || నా జీవితాన కురిసెనే నీ కృపామృతం Song Lyrics || Pas.John Wesley anna


    నా జీవితాన కురిసెనే నీ కృపామృతం

    నా జిహ్వకు మధురాతి మధురం నీ నామగానామృతం || 2 ||

    నీ కృపతోనే అనుక్షణం తృప్తి పొందెదను || 2 ||


    1. నీ దయ నుండి దూరము కాగా
ప్రేమతో పిలిచి పలుకరించితివే || 2 ||

కృపయే నాకు ప్రాకారము గల - ఆశ్రయపురమాయెను

నీ కృప వీడి క్షణమైనా నేనెలా మనగలను || 2 || || నా జీవితాన ||



2. నా యేసయ్యా - నీ నామమెంతో

ఘనమైనది - కొనియాడదగినది || 2 ||

కృపయేనా ఆత్మీయ అక్కరలు సమృద్ధిగా తీర్చెను

నీ మహదైశ్వర్యము ఎన్నటికి తరగనిది || 2 || || నా జీవితాన ||



3. నీ సన్నిధిని నివసించు నాకు

ఏ అపాయము దరిచేరనివ్వవు || 2 ||

కృపయేనా అడుగులు స్థిరపరచి బండపై నిలిపెను

నీ ఔన్నత్యమును తలంచుచూ స్తుతించెదను || 2 || || నా జీవితాన ||

No comments:

Post a Comment

Suggest your Song in the Comment.