Pages - Menu

Pages

Tuesday, January 11, 2022

Nee Mukhamu Manoharamu Song Lyrics || నీ ముఖము మనోహరము Song Lyrics || Ps John Wesley Garu (Hosanna Ministries RJY)


నీ ముఖము మనోహరము

నీ స్వరము మాధుర్యము
 
నీ పాదాలు అపరంజిమయము


యేసయ్యా నా ప్రాణ ప్రియుడా

మనగలనా నిను వీడి క్షణమైనా



1. నీవే నా తోడువై.. నీవే నా జీవమై -

నా హృదిలోన నిలచిన జ్ఞాపికవై (2)

అణువణువున నీ కృప నిక్షిప్తమై -

నను ఎన్నడు వీడని అనుబంధమై (2)

                                   ||యేసయ్యా||



2. నీవే నా శైలమై.. నీవే నా శృంగమై -

నా విజయానికే నీవు భుజబలమై (2)

అనుక్షణమున శత్రువుకు ప్రత్యక్షమై -

నను వెనుదీయనీయక వెన్ను తట్టినావు(2)

                                   ||యేసయ్యా||



3. నీవే వెలుగువై... నీవే ఆలయమై -

నా నిత్యత్వమునకు ఆద్యంతమై (2)

అమరలోకాన శుద్ధులతో పరిచయమై -

నను మైమరచి నేనేమి చేసెదను (2)

                                   ||యేసయ్యా||

No comments:

Post a Comment

Suggest your Song in the Comment.