Pages - Menu

Pages

Thursday, January 6, 2022

Paadave Koiela Telugu Song Lyrics || పాడవే కోయిల Telugu Song Lyrics || NEW SONG BY THANDRI SANNIDHI MINISTRIES



పల్లవి :పాడవే కోయిల- సుమధుర సువార్త గీతికా (2)

పరిశుద్ధ దేవుడు యేసుని మదిలో తలచుకొని

హల్లెలూయా.. హల్లెలూయా స్తోత్రమని (2)

|| పాడవే కోయిల||



1. మహిమతో వెలిగేటి మహారాజు -నాకై మహిమ వీడి వచ్చాడని
సర్వము నేలేటి రారాజు -నాకై నిరుపేద ఐనాడని (2)
మా పాప భారాన్ని యేసే మోసాడని -ఆ ప్రేమ కిలలోన ఏది సాటి రాదని
పాడవే.. పాడవే.. పాడవే .. కోయిల
పరిశుద్ధ దేవుడు యేసుని మదిలో తలచుకొని
హల్లెలూయా.. హల్లెలూయా స్తోత్రమని (2)
|| పాడవే కోయిల ||



2. మిడి మిడి జ్ఞానంతో మానవులు -చీకటి దారులను వెతికేరని
అంత తెలుసన్న మోసములో -అర్థములేని బ్రతుకు గడిపేరని (2)
యేసు మాట వినని బ్రతుకు అగ్నిగుండమేనని
ఇకనైనా నిజమునెరిగి మనసు మార్చుకోమని
పాడవే.. పాడవే.. పాడవే .. కోయిల
పరిశుద్ధ దేవుడు యేసుని మదిలో తలచుకొని
హల్లెలూయా.. హల్లెలూయా స్తోత్రమని (2)
|| పాడవే కోయిల ||

No comments:

Post a Comment

Suggest your Song in the Comment.