Pages - Menu

Pages

Wednesday, January 5, 2022

YESAYYAA NEEKE VANDANAM Song Lyrics | ENOSH KUMAR Songs | HADLEE XAVIER | KRANTHI CHEPURI | 4K TELUGU CHRISTIAN SONGS

 



భూమ్యాకాశములను సృజియించిన దేవా

నీ సన్నిధిలోనే ప్రవేశించెదను

నీ పరిశుద్ధతను ప్రకాశించుటకు

నీ పరిపూర్ణతలో నన్ను నడిపించుము

మహిమా నీకే… ఘనతా నీకే…

ప్రతి దినం నా ఆరాధన నీకే

మహిమా నీకే… ఘనతా నీకే…

నిరంతరం ఈ స్తోత్రార్పణ నీకే

యేసయ్యా.. నీకే వందనం – 4



1. మట్టి ముద్దనైన నన్ను మనిషిగా రూపించావు

వట్టి వాడనైన గాని మహిమతో నను నింపావు - 2

నీ కౌగిలిలో నను హత్తుకొని

అర చేతులలో నను చెక్కుకొని

నీ సన్నిధి కాంతిని నాపైనే ఉదయింపజేసావు - 2

ఏమివ్వగలను నేను నీ ప్రేమకై

                           పగిలిన హృదయముతో ఆరాధింతును         ||మహిమా||



2. ఘోర పాపినైన నన్ను ఎంతగా ప్రేమించావు

సిలువ పైన ప్రాణమిచ్చి వింతగా నను మార్చావు - 2

నా మనో నేత్రమును వెలిగించి

నా హృదయ కాఠిన్యమును మార్చి

అర్హతే లేని బలహీనుడనే ఎన్నుకున్నావు  - 2

ఏమిచ్చి నీ ఋణమును నే తీర్తును

విరిగి నలిగిన మనస్సుతో ఆరాధింతును         ||మహిమా||



Written & Composed: Kranthi Chepuri

Vocals: Enosh Kumar

No comments:

Post a Comment

Suggest your Song in the Comment.