Pages - Menu

Pages

Tuesday, January 11, 2022

Yeguruchunadi Vijayapathakam Song Lyrics || ఎగురుచున్నది విజయపతాకం Song Lyrics || Christian Telugu songs || Hosanna ministries songs.


ఎగురుచున్నది విజయ పతాకం

యేసు రక్తమే మా జీవిత విజయం

రోగ ధు:ఖ వ్యసనములను తీర్చివేయును

సుఖజీవనం చేయుటకు శక్తినిచ్చును

రక్తమే - రక్తమే - రక్తమే - యేసు రక్తమే

రక్తమే జయం - యేసు రక్తమే జయం



1. యేసునినామం ఉచ్చరింపగనే

సాతాను సైన్యము వణుకుచున్నది

వ్యాధుల బలము నిర్మూలమైనది

జయం పొందెడి నామము నమ్మినప్పుడే   || రక్తమే ||



2. దయ్యపు కార్యాలను గెలిచిన రక్తం

ఎడతెగకుండగ మనము స్మరణ చేయుదం

పాపపు క్రియలన్నిటిని చెదర గొట్టిన

క్రీస్తుని సిలువను మనము అనుసరించెదం   || రక్తమే ||



3. మా ప్రేమ వైద్యుడా ప్రాణనాధుడా

ప్రీతితోను నీ హస్తము చాపుము దేవా

నీ పాద పద్మముపై చేరియున్న ప్రజలను

స్వస్థపరచుము తండ్రి ఈ క్షణమందే   || రక్తమే ||

No comments:

Post a Comment

Suggest your Song in the Comment.