నీ ఆశీర్వాదం పొందిన కుటుంబం నీ సన్నిధిలోనే నిత్యము స్థిరపరచుము నీ చిత్తము నెరవేర్చుటయే నా జీవితం నీ పాదముల చెంత చేసెద అంకితం దీవించుము దేవా మా కుటుంబమును నీ దీవెన తరతరములకుండును దీవించుము దేవా మా పిల్లలను నీ దీవెన తరతరములకుండును 1. ఎన్నిక లేని నన్ను హెచ్చించితివి దీనుడనైన నన్ను దీవించితివి నీ చేతి నీడలో నను ఉంచితివి నీ రక్షణలో నను కాపాడితివి నీ అనురాగము యెంతో గొప్పది నీ సంకల్పము యెంతో గొప్పది
2. నీ స్వరము వినే సమూయేలులా హన్నా వలే నీ కొరకు పెంచాలయ్యా నీ శిక్షణలో నీ బోధలో కడవరకు వారిని వుంచాలయ్యా నిన్నే ఆరాధించెదరు దావీదులా నిన్నే ప్రకటించెదరు పౌలులా
No comments:
Post a Comment
Suggest your Song in the Comment.