Pages - Menu

Pages

Tuesday, January 3, 2023

AJEYUDA NAA YESAYYA SONG LYRICS | 2023 NEW YEAR SONG | BRO MATHEWS | KRUPA MINISTRIES, GUNTUR | 4K


పల్లవి :
అజేయుడా నా యేసయ్యా - నీవు నా తోడు ఉన్నావయ్యా

హర్షించి ఆరాధింతును - నీ కృప నాపై కురిపించినందున ||2||

విధాతవు నీవయ్యా - నివులేక నే లేనయ్యా

నిరంతరము నిన్నే కొనియాడెద యేసయ్యా ||2|| ||అజేయుడా||
1) లోకారణ్యములో - స్నేహితుడవైనావు

అలసిన వేళలో - నను బలపరిచితివి ||2||

సుఖ దుఃఖములో భాగస్వామివై |2||

ఎనలేని ప్రేమను నాకు పంచితివి ||2|| ||విధాతవు||
2) సమస్యల సాగరం - నను ముంచ చూడగా

సరసన నిలిచి - నన్నాదుకున్నావు||2||

ఆపద సమయములో – ఆశ్రయదుర్గమై ||2||

నీ కౌగిలిలో ననుచేర్చి – ఆదరించితివి ||2|| ||విధాతవు||

3) ఆత్మీయ యాత్రలో - నా తోడు ఉన్నావు

నీ అనుభవముతో - అణుకువ నేర్పితివి ||2||

శోధనవేదనలో కన్నతండ్రివై ||2||

అనురాగం ఆనందం నాకు పంచితివి ||2|| ||విధాతవు||

No comments:

Post a Comment

Suggest your Song in the Comment.