Pages - Menu

Pages

Sunday, January 22, 2023

Kannirelamma Song Lyrics || Samuel Karmoji ||



కన్నీరేలమ్మా కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా

కలవరపడకమ్మా కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా

కరుణ చూపి కలత మాన్పే యేసే తోడమ్మా



1. నీకేమి లేదని ఏమి తేలేదని

అన్నారా నిన్ను అవమానపరిచారా

తలరాత ఇంతేనని తరువాత ఏమవునోనని

రేపటిని గూర్చి చింతించుచున్నావా

చింతించకన్న యేసు మాటలు మరిచావా

మారాను మధురంగా మార్చెను చూసావా ||కన్నీరేలమ్మా||



2. నీకెవరు లేరని ఏంచేయలేవని

అన్నారా నిన్ను నిరాశపరిచారా

పురుగంటి వాడనని ఎప్పటికి ఇంతేనని

నా బ్రతుకు మారదని అనుకుంటూఉన్నావా

నేనున్నానన్న యేసు మాటలు మరిచావా

కన్నీరు నాట్యముగా మార్చును చూస్తావా||కన్నీరేలమ్మా||

No comments:

Post a Comment

Suggest your Song in the Comment.