నిను విడచి నా హృదయం
పరితపించే నీ కోసం
నేనంటే నీవే కదా
నీవు లేక నే లేనయ్య
నీ నిత్యప్రేమతో నన్ను వెదకితివి
నీ సత్యమార్గమందు నడిపితివి
నాన్న నాన్న నీ కుమారుడును నేను
నాన్న నాన్న నీ కుమార్తెను నేను
నిను విడచి ఎటు పోదును
నీవే నా ఆశ్రయపురము
ఎప్పటికి ఎరుగనైతిని
నీ కుమారుడును నేనని
నీ కంటిపాపగా నన్ను కాచితివి
నీ చేతినీడలో నాకు కాపుదల అయ్యా ||2||
నాన్న నాన్న నీ కుమారుడును నేను
నాన్న నాన్న నీ కుమార్తెను నేను
నీ కనుపాపనై నేను నాన్న ||4||
త్రోసివేయలేదు తృణీకరించలేదు
అవమానమునుండి విడిపించినావు నన్ను ||2||
త్రోసివేయలేదు తృణీకరించలేదు ||2||
అవమానమునుండి
కాపాడితివి నన్ను
హత్తుకొని ముద్దాడితివి.. నాన్న
ఆటంకము తొలగించి ఆదరించినావు
నాన్న నాన్న నీ కుమారుడును నేను
నాన్న నాన్న నీ కుమార్తెను
నీ ప్రతిరూపము నేను నాన్న ||4||
No comments:
Post a Comment
Suggest your Song in the Comment.