కావలి కావలి యేసు నీవే కావలి
రావాలి రావాలి నీ సన్నిధి నాతో రావాలి
నువ్వు లేకుండా నేను ఉండలేనయ్య నీ తోడు లేకుండా జీవించలేనయ్యా
అండ దండ నీవే యేసయ్యా నా కొండ కోట నీవే యేసయ్యా
కావలి కావలి యేసు నీవే కావలి
రావాలి రావాలి నీ సన్నిధి నాతో రావాలి
1. నా క్షేమా దారము నువ్వే ఈ జగతిలో
ఆక్షేపణ చేయను నేను ఏ కొరతలో ||2||
కలతలలో నేనున్నా కలవరపడనయ్యా
నీ తలపులలో నేనున్నా అంతే చాలయ్య ||2|| ||నువ్వు లేకుండా||
2. ఎడారి అయినా పుష్పిస్తుంది చల్లని నీ
చూపులతో మండుటెండ మంచి
అవుతుంది నీ దర్శన వేళలలో ||2||
అశైన స్వాసైన నీవే యేసయ్యా
నా ఊసైన ధ్యాసైనా నీ మీదేనయ్యా ||2|| ||నువ్వు లేకుండా||
3. నా బ్రతుకున ఓటములెన్నో గెలుపయ్యగా
నా చీకటి వెలుగుగా మారే నీ దయేగా ||2||
వేదనని వేడుకగా మలచిన యేసయ్య
వెల్లువలా నీ కృప ఏ దొరికిను చాలయ్య ||2|| ||నువ్వు లేకుండా||
No comments:
Post a Comment
Suggest your Song in the Comment.