Pages - Menu

Pages

Saturday, January 21, 2023

నీ మందిరమై నేనుండగా ... ||Ni mandiramai nenundaga Song Lyrics|Telugu Christian Song


పల్లవి:
నీ మందిరమై నేనుండగా

నా యందుండి నడిపించవా ||2||

నీవు తోడుండగా నాకు దిగులుండునా ||2||

వెంబడిస్తాను నిను యేసువా ||2||



చరణం1: నీవు కోరేటి దేవాలయం

నాదు దేహంబెగా నిశ్చయం ||2||

నీదు ప్రత్యక్షత నాకు కలిగించవా ||2||

నిత్యము నిన్ను స్తుతింతును ||2|| ||నీ మంధిరమై||


చరణం2: నాడు నిర్మించే దేవాలయం

రాజు సొలొమోను బహుసుందరం ||2||

అట్టి దేవాలయం నేను నిర్మించగా ||2||
నీ కట్టడలో నను నిల్పుమా ||2|| ||నీ మందిరమై||



చరణం3:హన్న ప్రార్ధనను విన్నావుగా

నేనున్నానని అన్నావుగా ||2||

నేడు సమూయెలుతో బహుగా మాట్లాడినా ||2||

దేవా నాతోటి మాట్లాడవా ||2|| ||నీ మందిరమై||


చరణం4:ఆత్మసత్యముతో ఆరాధింప

ఆత్మదేవుండు నేర్పించుమా ||2||

మహిమ రూపంబును నేను దర్సింపను ||2||

నా నేత్రంబు వెలిగించుమా ||2|| ||నీ మందిరంమై||



చరణం5:ఆ పరలోక ప్రతిబింబమై

ఈ ధరలోన దీపంబునై ||2||

ధరణి వెలిగించను కరుణ ప్రసరింపను ||2||

కరము తోడుంచి నడిపించుము ||2|| ||నీ మందిరమై||

No comments:

Post a Comment

Suggest your Song in the Comment.