Pages - Menu

Pages

Saturday, January 21, 2023

నీ స్వరము వినిపించు ప్రభువా Song Lyrics | Ni swaramu vinipinchu prabhuva song lyrics| Songs of Zion | siyonu geethalu | Telugu Christian Songs | Bible verses


నీ స్వరము వినిపించు ప్రభువా
నీ దాసుడాలకించున్ (2)
నీ వాక్యమును నేర్పించు
దానియందు నడుచునట్లు నీతో           ||నీ స్వరము||

1. ఉదయమునే లేచి – నీ స్వరము వినుట
నాకు ఎంతో మధురము
దినమంతటి కొరకు – నను సిద్ధపరచు
రక్షించు ఆపదలనుండి – (2)         ||నీ స్వరము||

2. నీ వాక్యము చదివి – నీ స్వరము వినుచు
నేను సరి చేసికొందు
నీ మార్గములో – నడుచునట్లుగా
నేర్పించుము ఎల్లప్పుడూ – (2)         ||నీ స్వరము||

3. భయ భీతులలో – తుఫానులలో
నీ స్వరము వినిపించుము
అభయము నిమ్ము – ఓ గొప్ప దేవా
ధైర్య పరచుము నన్ను – (2)         ||నీ స్వరము||

4. నాతో మాట్లాడు – స్పష్టముగా ప్రభువా
నీ స్వరము నా కొరకే
నీతో మనుష్యులతో – సరిచేసికొందు
నీ దివ్య వాక్యము ద్వారా – (2)         ||నీ స్వరము||

5. నేర్చుకున్నాను – నా శ్రమల ద్వారా
నీ వాక్యమును ఎంతో
నన్నుంచుము ప్రభువా – నీ విశ్వాస్యతలో
నీ యందు నిలచునట్లు – (2)         ||నీ స్వరము||

6. నా హృదయములోని – చెడు తలంపులను
చేధించు నీ వాక్యము
నీ రూపమునకు – మార్చుము నన్ను

నీదు మహిమ కొరకేగా – (2)         ||నీ స్వరము||

No comments:

Post a Comment

Suggest your Song in the Comment.