Pages - Menu

Pages

Tuesday, March 14, 2023

Devuniki Sthothramu Ganamu Song Lyrics || Andhra Kraisthava Keerthanalu


దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది

మనమందరము స్తుతిగానము చేయుటయే మంచిది



1. యెరుషలేము యెహోవాయే కట్టుచున్నవాడని

ఇశ్రయేలీయులను పోగుచేయువాడని ||దేవునికి||



2. గుండె చెదరిన వారిని బాగుచేయువాడని

వారి గాయములన్నియు కట్టుచున్నవాడని ||దేవునికి||



3. నక్షత్రముల సంఖ్యను ఆయనే నియమించును

వాటికన్నియు పేరులు పెట్టుచున్నవాడని ||దేవునికి||



4. ప్రభువు గొప్పవాడును అధిక శక్తి సంపన్నుడు

జ్ఞానమునకు ఆయనే మితియు లేనివాడని ||దేవునికి||



5. దీనులకు అండాయెనే భక్తిహీనుల కూల్చును

సితారాతో దేవుని స్తుతులతో కీర్తించుడి ||దేవునికి||



6. ఆయన ఆకాశమున్ మేఘములతో కప్పును

భూమికొరకు వర్షము సిద్ధపరచువాడని ||దేవునికి||



7. పర్వతములలో గడ్డిని పశువులకు మొలపించెను

అరచు పిల్లకాకులకును ఆహారము తానీయును ||దేవునికి||


8. కృప వేడు వారిలో సంతసించువాడని ||దేవునికి||

గుర్రముల నరులందలి బలము నానందించడు


9. యెరుషలేము యెహోవను సీయోను నీ దేవుని

కీర్తించుము కొనియాడుము ఆనందించువాడని ||దేవునికి||



10. పిల్లల నాశీర్వదించియు బలపరచు నీ గుమ్మముల్

మంచి గోధుమపంటతో నిన్ను తృప్తిగనుంచును ||దేవునికి||



11. భూమికి తనయాజ్ఞను ఇచ్చువాడు ఆయనే

వేగముగను దేవుని వాక్యము పరుగెత్తును ||దేవునికి||


12. వాక్యమును యాకోబుకు తెలియచేసినవాడని

ఏ జనముకీలాగున చేసియుండలేదని ||దేవునికి||

No comments:

Post a Comment

Suggest your Song in the Comment.