Pages - Menu

Pages

Tuesday, March 14, 2023

Yesutho Teeviganu Podama Song Lyrics | Andhra Kraisthava Keerthanalu

యేసుతో ఠీవిగాను పోదమా


యేసుతో ఠీవిగాను పోదమా

అడ్డుగా వచ్చు వైరి గెల్వను

యుద్ధనాదంబుతో బోదము ||యేసుతో||



1. రారాజు సైన్యమందు చేరను

ఆ రాజు దివ్య సేవ చేయను (2)

యేసు రాజు ముందుగా ధ్వజము బట్టి నడువగా (2)

యేసుతో ఠీవిగాను వెడలను ||యేసుతో||


2. విశ్వాస కవచమును ధరించుచు

ఆ రాజు నాజ్ఞ మదిని నిల్పుచు (2)

అనుదినంబు శక్తిని పొందుచున్నవారమై (2)

యేసుతో ఠీవిగాను వెడలను ||యేసుతో||



3. శోధనలు మనల చుట్టి వచ్చినా

సాతాను అంబులెన్ని తగిలినా (2)

భయములేదు మనకిక ప్రభువు చెంత నుందుము (2)

యేసుతో ఠీవిగాను వెడలను ||యేసుతో||


4. ఓ యువతి యువకులారా చేరుడి

శ్రీ యేసురాజు వార్త చాటుడి (2)

లోకమంత ఏకమై యేసునాథు గొల్వను (2)

సాధనంబెవరు నీవు నేనెగా ||యేసుతో||




No comments:

Post a Comment

Suggest your Song in the Comment.