Pages - Menu

Pages

Thursday, March 16, 2023

MA VUHAHALU PUTTAKA MUNDHE SONG LYRICS || YESU PAUL SONGS



మా ఊహలు పుట్టక మునుపే

మా ఊహలు పుట్టక మునుపే

మా సర్వమునెరిగిన దేవా (2)
ఇహపరములలో నీవే – మా కోర్కెలు తీర్చెడి ప్రభువా (2)
విశ్వాస నిరీక్షణతో – కనిపెట్టియున్నచో (2)
పొందెదము ఎన్నో మేలులూ

ప్రభువా నీ పాద సన్నిధిలో (2) ||మా ఊహలు||


1. నిన్నడుగకుండగనే – మోషేను పిలచితివి
నిన్నడిగిన సొలోమోనుకు –

జ్ఞాన సిరుల నొసగిన దేవా (2)
పలు సమయముల యందు –

పలు వరముల నిచ్చితివి (2)
అడుగనేల ప్రభువా ఈ ధరలో –

నీ దివ్య కృపయే చాలు        

||మా ఊహలు||

2. ప్రార్ధించుచుంటిమి – సమస్యలు తీర్చమని
నిన్నడుగుచున్నాము నీ – రాజ్యములో చోటిమ్మని (2)
ఊహించు వాటికంటె – అధికముగా నిచ్చెడి దేవా (2)
ఇంతకంటె మాకేమి వలదు – నీ తోడు నీడే చాలు

||మా ఊహలు||

No comments:

Post a Comment

Suggest your Song in the Comment.