Pages - Menu

Pages

Thursday, March 16, 2023

Rajadi Raja Ravikoti Teja Song Lyrics || Hosanna Ministries Songs


రాజాధిరాజ రవి కోటి తేజ
రమణీయ సామ్రాజ్య పరిపాలకా ||2|| విడువని కృప నాలో స్థాపించేనే సీయోనులో నున్న స్తుతుల సింహాసనమును ||2||

|| రాజాధి రాజా ||


1. వర్ణనకందని పరిపూర్ణమైన నీ మహిమ స్వరూపమును నాకొరకే త్యాగముచేసి||2|| కృపాసత్యములతో కాపాడుచున్నావు దినమెల్ల నీ కీర్తి మహిమలను నేను ప్రకటించేద ||2||

|| రాజాధి రాజా ||


2. ఊహలకందని ఉన్నతమైన నీ ఉద్దేశ్యములను నా యెడల సఫల పరిచి ||2|| ఊరేగించుచున్నావు విజయోత్సవముతో యేసయ్య నీకన్న తోడెవ్వరులేరు ఈ ధరనిలో||2||

|| రాజాధి రాజా ||


3. మకుటము ధరించిన మహారాజువై నీ సౌభాగ్యమును నా కొరకై సిద్ధపరచితివి ||2|| నీ పరిశుద్ధమైన మార్గములో నడిచి నీ సాక్షినై కాంక్షతో పాడెద స్తోత్ర సంకీర్తనలే ||2||

|| రాజాధి రాజా ||

No comments:

Post a Comment

Suggest your Song in the Comment.