పల్లవి: నాకోరిక నీ ప్రణాళిక పరిమళించాలని
నా ప్రార్థన విజ్ఞాపనా - నిత్యమహిమలో నిలవాలని
అక్షయుడా నీ కల్వరిత్యాగం అంకితభావం కలుగజేసెను
ఆశలవాకిలి తెరచినావు- అనురాగవర్షం కురిపించినావు
నాహృదయంలో ఉప్పొంగెనే - కృతజ్ఞతా సంద్రమే
నీసన్నిధిలో స్తుతి పాడనా - నాహృదయ విద్వాంసుడా
1. యదార్థవంతులయెడల నీవు యెడబాయక కృపచూపి
గాఢాంధకారము కమ్ముకొనగా వెలుగురేఖవై ఉదయించినావు
నన్ను నీవు విడిపించినావు - ఇష్టుడనై నేనడచినందున
దీర్ఘాయువుతో తృప్తిపరిచిన - సజీవుడవు నీవేనయ్యా
॥ నా హృదయములో ॥
2.నాలో ఉన్నది విశ్వాసవరము - తోడైయున్నది వాగ్దానబలము
ధైర్యపరచి నడుపుచున్నవి విజయ శిఖరపు దిశగా
ఆర్పజాలని నీప్రేమతో - ఆత్మదీపము వెలిగించినావు
దీనమనస్సు వినయభావము నాకు నేర్పిన సాత్వికుడా
॥ నా హృదయములో ॥
3.స్వచ్ఛమైనది నీవాక్యం - వన్నెతరగనిఉపదేశం
మహిమగలిగిన సంఘముగానను నిలుపునే నీ యెదుట
సిగ్గుపరచదు నన్నెన్నడూ - నీలోనాకున్న నిరీక్షణ
వేచియున్నాను నీకోసమే సిద్ధపరచుము సంపూర్ణుడా
॥ నా హృదయములో॥
No comments:
Post a Comment
Suggest your Song in the Comment.