Pages - Menu

Pages

Friday, March 3, 2023

Gaganamu cheelchukoni Song Lyrics || Dayaa Samkalpam - దయాసంకల్పం || Hosanna Ministries 2023 || Hosanna New Album || Pas.Freddy Paul


 పల్లవి:
గగనము చీల్చుకొని ఘనులను తీసుకొని

 నన్ను కొనిపోవ రానై యున్నా నా ప్రాణప్రియుడా యేసయ్యా

 నిన్ను చూడాలని నా హృదయమెంతో ఉల్లసించుచున్నది 

                                                                    ॥ గగనము చీల్చుకొని||




1. నీ దయ సంకల్పమే నీ ప్రేమను పంచినది 

నీ చిత్తమే నాలో నెరవేర్చుచున్నది

 పవిత్రురాలైన కన్యకగా నీ యెదుట నేను నిలిచెదను 

నీ కౌగిలిలో నేను విశ్రమింతును...

     

॥ గగనము చీల్చుకొని|| 



2.నీ మహిమైశ్వర్యమే జ్ఞాన సంపద ఇచ్చినది

 మర్మమైయున్న నీవలే రూపించుచున్నది 

కళంకములేని వధువునై నిరీక్షణతో నిను చేరెదను

 యుగయుగాలు నీతో ఏలేదను 

      

||గగనము చీల్చుకొని|| 



3.నీ కృపా బాహుళ్యమే ఐశ్వర్యము ఇచ్చినది

 తేజోవాసుల స్వాస్థ్యము అనుగ్రహించినది

 అక్షయమైన దేహముతో అనాది ప్రణాళికతో

 సీయోనులో నీతో నేనుందును... 

  ॥గగనము చీల్చుకొని||

No comments:

Post a Comment

Suggest your Song in the Comment.