Pages - Menu

Pages

Wednesday, March 22, 2023

Neekai Vedana Song Lyrics- Telugu Christian Video Song (Official) 2018 || Musical Single || Digital Gospel Digital Gospel

ఎన్నెన్నో వేదనలు


ఎన్నెన్నో వేదనలు అనుభవించినాడు - నిను రక్షించుట కొరకే
మన పాపం కడుగుట కొరకే (2)

వెలలేనిది.. తన త్యాగం.. కనలేనిదీ.. ఆ మరణం
విలువైన నీకోసమే - బలియాయెను మనకోసమే (2) క్రీస్తేసుని ఈ త్యాగము - మనకోసమే బలియాగము
నీ రక్షణే తన ద్యేయము - నువు నమ్మినచో నిత్యజీవము ||ఎన్నెన్నో||

1. ఎంతెంత అవమానము - సహియించెను తన మౌనం (2)
అన్యాయమే గెలిచిందిగా - మన శిక్షకు తను తలవంచెగా (2)
మెలిపెట్టిన కొరడాలు చీల్చేసేను తనువణువు - ఒలికించే తన రక్తమె - మనపాప పరిహారమే
అది మనపాప పరిహారమే ||క్రీస్తేసుని||

2. శిరమంత ముండ్లేగా - పలుమార్లు దిగబడగ (2)
మోసాడు సిలువ భారమే (అది)మనఘోర పాపభారమే (2)
బంధిచెను ఆచీలలు వ్రేలాడెను తన తనువు -
విడిచేసే తన శ్వాసనే - విమోచించే మన ప్రాణమె
విమోచించె మన ప్రాణమె ||క్రీస్తేసుని||

No comments:

Post a Comment

Suggest your Song in the Comment.