Pages - Menu

Pages

Monday, March 27, 2023

NIJA SNEHITHUDA SONG LYRICS|| Na Chelimi Kori Song Lyrics|| నిజ స్నేహితుడా| GOOD FRIDAY & EASTER SONG 2023| HADLEE XAVIER| SURYA PRAKASH|

నిజ స్నేహితుడా


పల్లవి:
నా చెలిమి కోరి - నీ కలిమి వీడి,

నా చెంత చేరావు శ్రీమంతుడా!

నా రక్షణ కొరకై - ఆ శిక్షను పొంది,

బలియాగమైన నిజ స్నేహితుడా! (2)



1. ద్రోహినై - దూరమైతిని,

పాపినై - పరుగులెడితిని

గమ్యమే - ఎరుగనైతిని

మరణమే - శరణమాయెను.

ఎంతో ప్రేమించితివి - నాస్థానమందు నిలిచితివి,

కృపతో నను రక్షించితివి - నా దోషశిక్ష భరించితివి. ll నా చెలిమి ll


2. నిందలు - అవమానములు,

హేళనలు - చీత్కారములు

కఠిన దెబ్బలు - ముళ్లపోటులు,

శిలువ భారం - కాయమంతా గాయం

హృదినే బాధించినా - భరించావు వేదన మౌనముగా

తనువే తల్లడిల్లినా - తృప్తినొందావు నను తలచుకొని. llనా చెలిమి ll


ఏ రీతి నిన్ను - కీర్తించగలను?

నా నీతి నీవే ఓ యేసుదేవా!

నీ సాక్షిగా నిలిచి - నీ ప్రేమను చాటి,

ఘనపరతును నిన్నే ప్రియ స్నేహితుడా!

No comments:

Post a Comment

Suggest your Song in the Comment.