Pages - Menu

Pages

Thursday, March 16, 2023

Sthuthinchina Sathan Paripothadu Song Lyrics || FR SJ BERCHMANCE Songs


స్తుతించిన సాతాన్‌ పారిపోతాడు


స్తుతించిన సాతాన్‌ పారిపోతాడు - కునికితే తిరిగివస్తాడు ||2||
స్తుతించి పాడి - కోటను కూల్చెదం
స్తుతుల శక్తితో యెరికో పట్టెదం ||2||


1. దావీదు పాడగా సౌలుకు విడుదల ||2||
కలతలు తీరెను నెమ్మది దొరికెను ||2||

||స్తుతించి పాడి ||

2. స్తుతించు దావీదుకు - ధైర్యము నిండెను ||2||
విశ్వాసవాక్కుతో - గొల్యాతును గెల్చెను ||2||

||స్తుతించి పాడి ||

3. గొర్రెలకాపరి - రాజుగా మారెను ||2||
ఆరాధనా వీరునికి - ప్రమోషన్‌ దొరికెను ||2||

||స్తుతించి పాడి ||


4.చేప కడుపులో - యోనా స్తుతించెను ||2||
విడుదల పొంది - నీనెవె చేరెను ||2||

||స్తుతించి పాడి ||

5. పెదవిపై స్తుతులూ - చేతిలో వాక్యం ||2||
స్వార్ధం నలుగగొట్టి - జయమును పొందెదం ||2||

||స్తుతించి పాడి ||

No comments:

Post a Comment

Suggest your Song in the Comment.