Pages - Menu

Pages

Thursday, March 30, 2023

Yesu Rajuga Vachuchunnadu Song Lyrics || Andhra Kraisthava Songs || Christian Telugu Song Lyrics


యేసు రాజుగా వచ్చుచున్నాడు
భూలోకమంతా తెలుసుకొంటారు (2)
రవికోటి తేజుడు రమ్యమైన దేవుడు (2)
రారాజుగా వచ్చు చున్నాడు (2)    ||యేసు||


1. మేఘాలమీద యేసు వచ్చుచున్నాడు
పరిశుద్దులందరిని తీసుకుపోతాడు (2)
లోకమంతా శ్రమకాలం (2)
విడువబడుట బహుఘోరం        ||యేసు||


2. ఏడేండ్లు పరిశుద్దులకు విందవబోతుంది
ఏడేండ్లు లోకం మీదికి శ్రమ రాబోతుంది (2)
ఈ సువార్త మూయబడున్‌ (2)
వాక్యమే కరువగును         ||యేసు||


3. వెయ్యేండ్లు ఇలపై యేసు రాజ్యమేలును
ఈ లోక రాజ్యాలన్ని ఆయన ఏలును (2)
నీతి శాంతి వర్ధిల్లును (2)

న్యాయమే కనబడును        ||యేసు||

4. ఈ లోక దేవతలన్నీ ఆయన ముందర
సాగిలపడి నమస్కరించి గడగడలాడును (2)
వంగని మోకాళ్ళన్నీ (2)
యేసయ్య యెదుట వంగిపోవును        ||యేసు||


5. క్రైస్తవుడా మరువవద్దు ఆయన రాకడ
కనిపెట్టి ప్రార్ధనచేసి సిద్ధముగానుండు (2)
రెప్ప పాటున మారాలి (2)
యేసయ్య చెంతకు చేరాలి   ||యేసు||

No comments:

Post a Comment

Suggest your Song in the Comment.